)
GST Reforms Announced PM Modi: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా జీఎస్టీ భారాన్ని కూడా భారీగా తగ్గించనున్నట్లు మరో శుభవార్త కూడా చెప్పారు. దీపావళి లోపు డబుల్ బోనాంజా ప్రజలకు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. జీఎస్టీ భారాన్ని భారీగా తగ్గించనున్నారు. ఇప్పటికే జీఎస్టీ పై హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి దాన్ని రివ్యూ చేయిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఇక త్వరలోనే నెక్ట్స్ జనరేషన్ జీఎస్టీ అమల్లోకి తీసుకువచ్చి ప్రజలపై భారాన్ని భారీగా తగ్గిస్తామన్నారు.
అంతే కాదు రాబోయే తరం అన్ని రకాల సంస్కరణలు తీసుకురావడమే మా లక్ష్యం. ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అన్నారు. జీఎస్ట రేట్లు సమీక్షించి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని సామాన్యులపై పన్ను భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అయితే ఈ పన్నుల భారం తగ్గితే దీనివల్ల పన్ను వ్యవస్థ మరింత సరళీకృతం కూడా అవుతుంది. సామాన్యులకు, వ్యాపారులకు ప్రత్యక్ష ప్రయోజనాలు పొందుతారు అని మోదీ అన్నారు. ఇక వ్యాపారులకు కూడా ఇది భారీ ఉపశమనం లభిస్తుంది. పన్నుల వ్యవస్థ పారదర్శకంగా కూడా తమ హయాంలో జరిగిందన్నారు. ఇక దీపావళికి జీఎస్టీ రేటుకు తగ్గించడంతో వ్యాపార ప్రపంచానికి భారీ ఉపశమనం కలిగించడమే కాకుండా ద్రవ్యోల్బణం నుండి కూడా వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది అన్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "This Diwali, I am going to make it a double Diwali for you... Over the past eight years, we have undertaken a major reform in GST... We are bringing next-generation GST reforms. This will reduce the tax burden across the… pic.twitter.com/2hAPP0CFtH
— ANI (@ANI) August 15, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసిఫ్ మునీర్ మొన్న చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు. భారత్ ఎప్పుడూ అణు బెదిరింపులకు, బ్లాక్ మెయిల్‌లకు భయపడదు అని హెచ్చరించారు. తమ ధైర్యవంతులైన సైనికులు శత్రువులకు ఊహకు మించి శిక్షించారు అని ఎర్రకోట వేదికగా మోదీ గర్జించాడు. మన దేశం దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుంది. ఉగ్రవాదులకు వారికి మద్దతు ఇచ్చే దేశానికి తేడా లేదు. ఇద్దరు మానవాళికి శత్రువులే అని మోడీ ఆగ్రహించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి