)
Railway Station Without a Name or Address: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లో భారతీయ రైల్వే నాలుగవ స్థానంలో ఉంది. ప్రతిరోజూ వందలాది రైళ్లు నడువగా.. ఆ రైళ్లు వేల రైల్వే స్టేషన్ల గుండా వెళ్తాయి. అందులో లక్షలాది మంది ప్రయాణిస్తారు. అయితే.. మీరు రైలులో ప్రయాణించడానికి టికెట్ బుక్ చేసుకోవాలి లేదా కొనుక్కోవాలి. అలాగే మీరు ఏ స్టేషన్‌కు వెళ్లాలనుకుంటున్నారో సమాచారం కూడా ఇవ్వాలి. అంటే మీ రైల్వే స్టేషన్ పేరును టికెట్‌పై పేర్కొనాలి. కానీ భారతదేశంలో ఒక రైల్వే స్టేషన్ ఉంది.. దానికి పేరు లేదు, టికెట్ కౌంటర్ కూడా ఉంది. అక్కడికి రైళ్లు వస్తాయి.. వెళ్తాయి.. ప్రజలు వస్తారు.. వెళ్తారు.. కానీ ఈ స్టేషన్‌కు మాత్రం పేరు లేదు.
భారతదేశంలో రైల్వే స్టేషన్లు ఎన్నో ఉన్నాయి. ప్రతి స్టేషన్‌కు ఒక పేరు ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ సమీపంలో ఒక వింతైన రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్‌కు పేరు లేదు. 2008 నుండి ఈ స్టేషన్‌కి రైళ్లు వస్తున్నాయి, వెళ్తున్నాయి. ప్రయాణికులు టిక్కెట్లు కొంటున్నారు, రైళ్లలో ప్రయాణిస్తున్నారు. కానీ ఈ స్టేషన్‌కు మాత్రం ఇప్పటికీ పేరు లేదు.
ఈ స్టేషన్ బర్ధమాన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 17 సంవత్సరాలుగా ఇది పేరు లేకుండానే నడుస్తోంది. ఈ స్టేషన్లో బంకురా-మసగ్రామ్ ప్యాసింజర్ రైలు మాత్రమే ఆగుతుంది. ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది.. ఆదివారం మాత్రం రాదు. ఎందుకంటే ఆదివారం స్టేషన్ మేనేజర్ టిక్కెట్ల కోసం బర్ధమాన్ వెళ్లడంతో.. స్టేషన్‌ని మూసివేస్తారు.
అయితే ఈ స్టేషన్‌కు పేరు లేకపోవడానికి ఓ కారణం కూడా ఉంది. ఈ స్టేషన్‌ను నిర్మించినప్పుడు రైల్వే అధికారులు దీనికి రాయ్‌నగర్ అని పేరు పెట్టారు. కానీ స్థానిక గ్రామాల మధ్య ఈ పేరుపై వివాదం తలెత్తింది. స్థానికులు ఈ పేరును వ్యతిరేకించారు. అలాగే మరో పేరు పెట్టమని కోరడంతో.. ఈ విషయం కోర్టుకెక్కింది. దీంతో అప్పటి నుండి స్టేషన్‌కు పేరు పెట్టలేదు. స్టేషన్ వద్ద నేమ్ బోర్డు ఉంది.. కానీ అది ఖాళీగా ఉంది. టిక్కెట్లపై ఇప్పటికీ పాత పేరు రాయ్‌నగర్ అని ముద్రించబడుతుంది. ఈ పేరులేని స్టేషన్ భారతీయ రైల్వేలలో ఒక అరుదైన స్టేషన్‌గా చెప్పుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook