)
India Vice President Salary: భారత ఉపరాష్ట్రపతి పదవి దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి. ఈ పదవిలో ఉన్నవారు పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభకు అధ్యక్షుడిగా పనిచేస్తారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే.. ఒక వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి మరియు 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
ఉపరాష్ట్రపతి బాధ్యతలు ఏంటి...?
రాజ్యసభ సమావేశాలను నడిపించడం, క్రమశిక్షణ పాటించేలా చూడడం, బిల్లులు, చర్చలు, ఓటింగ్లను నిర్వహించడం వారి ప్రధాన బాధ్యతలు. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు లేదా తాత్కాలికంగా రాష్ట్రపతి లేనప్పుడు ఉపరాష్ట్రపతి ఆ బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ సమయంలో వారు రాష్ట్రపతి అధికారాలను ఉపయోగించవచ్చు. అయితే, రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది.
ఉపరాష్ట్రపతి జీతం, ప్రయోజనాలు ఏంటి..?
* ఉపరాష్ట్రపతికి నెలకు 4 లక్షల రూపాయల జీతం వస్తుంది. ఇది రాజ్యసభ అధ్యక్షుడిగా వారి సేవలకు ఇవ్వబడుతుంది.
* దీనితో పాటు ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లాలో ఉచితంగా నివసించే సౌకర్యం ఉంటుంది. నిర్వహణ, విద్యుత్, టెలిఫోన్ ఖర్చులను ప్రభుత్వమే చూసుకుంటుంది.
* దేశంలోని, విదేశాల్లోని అధికారిక పర్యటనలకు ఉచిత విమానం, రైలు, వాహన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
* విదేశీ పర్యటనల్లో కాన్సులర్ మర్యాదలు కూడా లభిస్తాయి.
* ఉపరాష్ట్రపతి, వారి కుటుంబానికి AIIMS వంటి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుతాయి.
ఉపరాష్ట్రపతికి వచ్చే పెన్షన్ ఎంత..?
పదవీ కాలం ముగిసిన తర్వాత ఉపరాష్ట్రపతికి నెలకు 1.5 లక్షల రూపాయల పెన్షన్ లభిస్తుంది. అంతేకాదు, కొంత కాలం పాటు ప్రభుత్వ గృహం, భద్రత, వైద్య సౌకర్యాలు కూడా అందుతాయి. రోజువారీ భత్యం, కార్యాలయ ఖర్చులు, ప్రయాణ భత్యం కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఉపరాష్ట్రపతికి Z+ కేటగిరీ భద్రత ఉంటుంది, దీనికోసం NSG, ఢిల్లీ పోలీసులు, CISF సిబ్బందిని నియమిస్తారు.
దేశ 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్..
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయన దేశ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి. మరోవైపు, ఇండియా కూటమి తరుఫున పోటీ చేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయనకు 300 ఓట్లు మాత్రమే వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook