Driving License Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేయడం ఎలా

Driving License Renewal: రోడ్డుపై వాహనం నడిపేందుకు కావల్సిన ప్రధానమైన డాక్యుమెంట్ డ్రైవింగ్ లైసెన్స్. ఇందులో చాలా రకాలుంటాయి. టూ వీలర్, ఫోర్ వీలర్‌తో పాటు భారీ వాహనాల డ్రైవింగ్ లైసెన్ విడిగా ఉంటుంది. ప్రతి డ్రైవింగ్ లైసెన్స్‌కు ఎక్స్‌పైరీ ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 15, 2025, 09:23 PM IST
Driving License Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేయడం ఎలా

Driving License Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ ముగిసిన వెంటనే రెన్యువల్ చేయించకపోతే జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఎప్పుడైనా పోలీసులకు పట్టుబడితే వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఆన్‌లైన్ విధానంలో కూడా రెన్యువల్ చేయించుకోవచ్చని మీకు తెలుసా.

Add Zee News as a Preferred Source

వాహనాలు నడిపేటప్పుడు రోడ్ రెగ్యులేషన్స్ , నిబంధనలు ప్రతి దేశంలోనూ ఉంటాయి. వీటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాహనం కాగితాలు, కాలుష్యం సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ఇలాంటివి తప్పనిసరిగా ఉండాలి. వీటన్నింటిలో కామన్‌గా ఉండాల్సింది, అతి ముఖ్యమైంది డ్రైవింగ్ లైసెన్స్ . ఇది లేకుండా వాహనం తీసుకుని రోడ్డెక్కడం నేరం. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ఎక్స్‌పైరీ అయిపోయి ఉంటుంది. మనకు తెలియకపోవచ్చు. ఇలాంటప్పుడు పట్టుబడితే చాలా చర్యలు ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ ముగిసి ఎక్కువ కాలం ఉంటే అది రద్దయ్యే అవకాశముంది. అదే జరిగితే మళ్లీ కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ విధానంలో కూడా రెన్యువల్ ప్రక్రియ కొనసాగించవచ్చు. అదెలాగో చూద్దాం

డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎప్పుడూ నిర్దిష్టమైన సమయం కోసం జారీ చేస్తుంటారు. ఒకసారి ఎక్స్‌పైరీ అయిపోతే రెన్యువల్ చేయించేందుకు 30 రోజులు సమయం ఉంటుంది. నెల రోజుల్లో రెన్యువల్ చేయిస్తే రెన్యువల్ ఫీజు 400 రూపాయలు ఉంటుంది. అదే ఆ తరువాత చేయిస్తే మాత్రం లేట్ ఫీ 1500 చెల్లించాలి. దేశంలో అమల్లో ఉన్న మోటారు వాహనాల చట్టం ప్రకారం 40 ఏళ్లకు పరిమితి ఉంటుంది. ఆ తరువాత మరో పదేళ్లు పొడిగిస్తారు. అదే 50 ఏళ్లు దాటితే మాత్రం రెన్యువల్ ఐదేళ్లకే చేస్తుంటారు. ఎక్స్‌పైరీ వ్యాలిడిటీకు ఏడాదిలోగా రెన్యువల్ చేయించకపోతే అది రద్దయిపోతుంది. తిరిగి కొత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. 

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఎలా

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఆన్‌లైన్‌లో హాయిగా చేసుకోవచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ముందుగా మీ రాష్ట్రానికి సంబంధించిన ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అప్లై ఆన్‌లైన్ క్లిక్ చేయాలి. ఆ తరువాత సర్వీసెస్ ఆప్షన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఎంచుకోవాలి. మీ రాష్ట్రం ఎంచుకోవాలి. అక్కడ కన్పించే అప్లికేషన్ ఫిల్ చేసి పుట్టిన తేదీ, లైసెన్స్ నెంబర్ ఇతర వివరాలు సమర్పించాలి. తరువాత రెన్యువల్ ఆప్షన్ ఎంచుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ విధానంలో పేమెంట్ చేయాలి. అంతే మీ కార్డు రెన్యువల్ అయిపోతుంది. 

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం కావల్సిన డాక్యుమెంట్లు

ఎక్స్‌పైరీ డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఉన్న ఫోటో, ఐడెంటిటీ కార్డ్, అడ్రస్ ప్రూఫ్

Also read: Pan Card: మీ పాన్ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవడం, యాక్టివేట్ చేయడమెలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News