)
Dussehra 2025 men wear saree and perform garba dance in Ahmedabad video: దేశంలో ప్రస్తుతం శారదీయ నవరాత్రుల ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం దేశ మంతట ఎక్కడ చూసిన దసరా పండగ జోష్ లో ఉన్నారు. అయితే.. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ లలో ఎక్కువగా గార్బా డ్యాన్స్ లు చేస్తు యువతీ, యువకులు హల్ చల్ చేశారు . ట్రెడిషన్ దుస్తులు ధరించి మరీ అమ్మవారి ప్రాంగణం ముందు డ్యాన్స్ లు చేస్తు హల్ చల్ చేశారు.
గర్బా నేపథ్యంలో అనేక ఈవెంట్ ఆర్గనైజేషన్ లు కూడా ఈ వేడుకను భారీగా క్యాష్ చేసుకున్నాయి. ఎక్కడ చూసిన గార్బా డ్యాన్స్ లతో యువతీ, యువకులు రచ్చ చేశారు. అయితే.. ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అనాదీగా మగాళ్లు చీరలు, లేడీస్ దుస్తులు ధరించి గార్బా డ్యాన్స్ లు చేశారు. ఇక్కడ దాదాపు 200 ఏళ్ల నుంచి ఇదే సంప్రదాయంను పాటిస్తున్నారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 200 ఏళ్లుగా మగాళ్లంతా చీరలు ధరించి గర్బా ఆడే ఆచారంను పాటిస్తున్నారు. చీరలలో పురుషులు సదుమానా గర్బా అని పిలువబడే సంప్రదాయంలో గర్బాను ప్రదర్శిస్తారు. ఇది వారి భక్తి, తపస్సు, శాపం యొక్క పురాతన కథను గౌరవిస్తుంది.
ఇక్కడి ప్రజల నమ్మకాల ప్రకారం, ఈ ఆచారం కేవలం నృత్యం కాదని, 200 సంవత్సరాల క్రితం, ఒక మొఘల్ కులీనుడు తనను ఉంపుడు గత్తెగా కోరుకున్నప్పుడు, సాదుబెన్ అనే మహిళ బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులను తనను రక్షించమని కోరింది. కానీ ఆసమయంలో మగాళ్లు ఎవరు ఆమెకు సాయం చేయలేదు. దీంతో ఆమె తన బిడ్డను కోల్పోయింది.
సాదుబెన్ అప్పుడు.. పురుషుల్ని శపించింది. ఇక నుంచి భవిష్యత్ పురుషులంతా పిరికి వాళ్లు అవుతారని శాపం ఇచ్చి, సతీకి పాల్పడింది. దీంతో అప్పటి నుంచి నవరాత్రుల్లో చివరన నవమి రోజున ఈ విధంగా పురుషులంతా చీరలు ధరించి సాదుబెన్ ఆశీస్సుల కోసం ఇలా గార్బా ఆడతారంట. ఇలా చేస్తే మంచిజరుగుతుందని అక్కడి వాళ్ల నమ్మకంఅని చెబుతుంటారు.