)
India Semiconductor Mission: భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాపార అనుకూల దృక్పథం, పెట్టుబడిదారుల పట్ల చూపిస్తున్న సానుకూల వైఖరి ప్రపంచంలోనే అగ్రగామి సెమీకండక్టర్ సంస్థ ఏఎస్ఎంఎల్ ను కూడా ఆకట్టుకుంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఫ్రాంక్ హీమ్స్కెర్క్ ఇటీవల బ్రస్సెల్స్‌లో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో మాట్లాడుతూ.. పెట్టుబడులు ఆకర్షించడంలో మోదీ శ్రద్ధ నిజంగా ప్రశంసనీయమైంది.. ప్రత్యేకమైనది. ఆయన నేరుగా కంపెనీల అభిప్రాయాలను వింటారు. ఆచరణలో మార్పులు చేయడానికి ముందుంటారు అంటూ ప్రశంసించారు.
హీమ్స్కెర్క్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తమ కంపెనీ సీఈవో క్రిస్టోఫ్ ఫౌకేతో మోదీ దాదాపు రెండు గంటలపాటు ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మోదీ కేవలం వినడమే కాకుండా, మీరు నిజాయితీగా చెప్పండి… మేం ఇంకా మెరుగ్గా ఏం చేయాలి? అని అడిగారని తెలిపారు. ఈ విధమైన నిక్కచ్చి వైఖరి యూరప్ లేదా ఇతర ప్రాంతాల నేతల్లో కనిపించదని ఆయన పేర్కొన్నారు.
తన ప్రసంగంలో హీమ్స్కెర్క్ యూరప్ దేశాల నాయకుల పనితీరును పరోక్షంగా విమర్శించారు. యూరప్‌లో ఒక కమిషనర్‌ను కలవడం కంటే అమెరికాలోని వైట్‌హౌస్‌లో సీనియర్ అధికారిని కలవడం చాలా సులభం. కానీ పెట్టుబడిదారులతో నేరుగా మాట్లాడటంలో మోదీ చూపిన ఆసక్తి మాకు కొత్త అనుభవం అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు యూరప్ రాజకీయ నాయకులు కూడా మోదీ మాదిరిగానే పారదర్శకంగా పెట్టుబడిదారులతో సంభాషించాలి అనే సూచనలా నిలిచాయి.
ఈ ప్రశంసలు రావడం వెనుక కారణం భారత్ సెమీకండక్టర్ రంగంలో చేస్తున్న విప్లవాత్మక మార్పులే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో రూపొందించిన ‘విక్రమ్ చిప్’ ను ప్రధాని మోదీకి అందించారు. 2025 నాటికి దేశీయంగా తయారైన చిప్‌లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయని మోదీ ప్రకటించారు. 2021లో కేంద్ర ప్రభుత్వం రూ. 76,000 కోట్లతో ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ ద్వారా భారత్ ప్రపంచ చిప్ తయారీ హబ్‌గా మారాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో తయారీ యూనిట్లు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కాగా ఇప్పుడు ASML వంటి టెక్ దిగ్గజం ఇచ్చిన ప్రశంసలు భారత్ పెట్టుబడి వాతావరణానికి మరింత గ్లోబల్ గుర్తింపు తెచ్చిపెట్టాయి.
మోదీ నాయకత్వంలో భారత్ తయారీ రంగంలో కొత్త అధ్యాయం రాస్తోందని చెప్పవచ్చు. పారదర్శక పాలన, నేరుగా పెట్టుబడిదారులతో సంభాషణ, దీర్ఘకాలిక దృష్టితో రూపొందించిన సెమీకండక్టర్ మిషన్ ఇలా ఇవన్నీ కూడా భారతదేశాన్ని చిప్ తయారీకి భవిష్యత్ ప్రపంచ కేంద్రంగా రూపొందిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.