New Scheme: మహిళలు ఇంత మంచి ఛాన్స్ మిస్ అవ్వకండి.. మీ కోసం LIC అదిరే స్కీం.. పెట్టుబడి లేకుండానే ఫ్రీగా నెలకు రూ. 7 వేలు

Bima Sakhi Yojana: ఇప్పుడు మహిళలకు LIC ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఏ రూపాయి పెట్టుబడి లేకుండానే నెలకు రూ.7,000 వరకు పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ పథకానికి అర్హులైన వారు.. ప్రభుత్వ సబ్సిడీ ద్వారా నేరుగా లబ్ధి పొందవచ్చు. ముఖ్యంగా గృహిణులు, స్వయం ఉపాధిపై ఆధారపడే మహిళలకు ఇది ఒక రక్షణ కవచంలా మారుతుంది. మీరు కూడా ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దనుకుంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..  

Written by - Aruna Maharaju | Last Updated : Aug 3, 2025, 01:48 PM IST
New Scheme: మహిళలు ఇంత మంచి ఛాన్స్ మిస్ అవ్వకండి.. మీ కోసం LIC అదిరే స్కీం.. పెట్టుబడి లేకుండానే ఫ్రీగా నెలకు రూ. 7 వేలు

LIC New Scheme for Women: దేశంలోని ప్రజల కోసం భారత జీవిత బీమా సంస్థ(LIC) అనేక మంచి పథకాలను అందిస్తోంది. తాజాగా మహిళల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒక్క రూపాయి చెల్లించకుండానే.. నెలకు 7 వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఈ పథకం పేరు బీమా సఖి యోజన. ఇది మహిళలకు నెలవారీ ఆదాయాన్ని అందించడంతో పాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి రూపొందించబడింది. ఈ పథకం మహిళల సాధికారతకు ఎంతో దోహదం చేస్తుంది.

Add Zee News as a Preferred Source

అసలు ఏంటి ఈ పథకం.. 
ఈ ఎల్ఐసి బీమా సఖి యోజన అనే పథకం మహిళలకు LIC ఏజెంట్లుగా పనిచేసే అవకాశాన్ని ఇస్తుంది. ఇందులో చేరిన మహిళలకు శిక్షణ కూడా అందిస్తారు. ఈ ఏజెంట్లకు ప్రతి నెలా జీతం రూపంలో డబ్బు చెల్లిస్తారు. సమాజంలో బీమా గురించి మహిళల్లో అవగాహన పెంచడానికి LIC ఈ స్కీంని ప్రారంభించింది. ఈ యోజనలో భాగంగా మహిళా ఏజెంట్లకు వారి పనితీరు బట్టి.. మొదటి మూడు సంవత్సరాలు నెలవారీ ఆదాయం ఇస్తారు. మొదటి సంవత్సరంలో నెలకు 7 వేల రూపాయలు అందుతాయి.

ఎవరెవరు అర్హులు.. 
LIC బీమా సఖి యోజనలో చేరాలనుకునే మహిళల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు గరిష్టంగా 70 సంవత్సరాలు ఉండాలి. వారు కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. ఈ పథకం ద్వారా మొదటి సంవత్సరం నెలకు 7 వేల రూపాయలు ఆదాయంగా పొందవచ్చు. రెండవ సంవత్సరంలో నెలకు 6 వేల రూపాయలు అందుతాయి. కానీ దీనికి ఒక షరతు ఉంది. మొదటి సంవత్సరంలో తీసిన బీమా పాలసీలలో.. కనీసం 65 శాతం యాక్టివ్ గా ఉండాలి. ఈ పథకం కోసం ఎల్ఐసి కార్యాలయంలో లేదా వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఎవరెవరు అనర్హులు.. 
LIC బీమా సఖి యోజనలో కొందరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. ఇప్పటికే LIC ఏజెంట్‌గా లేదా ఉద్యోగిగా ఉన్నవారు ఈ పథకంలో చేరలేరు. LIC ఉద్యోగుల బంధువులైన భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సోదరీసోదరులు, అత్తమామలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేయలేరు. అలాగే పదవీ విరమణ చేసిన LIC ఉద్యోగులు లేదా మాజీ ఏజెంట్లు కూడా ఈ యోజనకు అర్హులు కాదు.

అప్లై చేయాలంటే ఏం ఉండాలి.. 
LIC బీమా సఖి యోజనలో అప్లై చేసుకోవడానికి కొన్ని పేపర్స్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి.  డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, టెన్త్ స్టడీ సర్టిఫికేట్ మరియు దరఖాస్తు ఫారంతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా ఉండాలి. మరి ఇంకేందుకు ఆలస్యం ఇండిపెండెంట్ గా ఉండాలనుకొనే మహిళలు.. వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 

Also Read: Biggest Jail: వామ్మో ఓ నగరమంతా పెద్దగా ఉన్న జైలు.. ఎన్ని ఎకరాల్లో ఉందో తెలిస్తే పక్కా ఆశ్యర్యపోతారు..!  

Also Read: Saina Nehwal: నెల క్రితమే విడాకులన్నారు.. మళ్లీ అంతలోనే దూరం దగ్గర చేసిందంటూ సైనా నెహ్వాల్ పోస్ట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News