Electricity Charges cut off: విద్యుత్ ఛార్జీలను భారీగా తగ్గించిన ఆ రాష్ట్రం..

Electricity Charges cut off: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా  కరెంట్ ఛార్జీలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఏదైనా ఎలక్ట్రిక్  వస్తువు వాడాలంటే భయపడేలా కరెంట్ ఛార్జీలు ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. అలాంటి తరుణంలో ఈ రాష్ట్రం మాత్రం కరెంట్ ఛార్జీలను తగ్గించడం విశేషం. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 26, 2025, 01:07 PM IST
Electricity Charges cut off: విద్యుత్ ఛార్జీలను భారీగా తగ్గించిన ఆ రాష్ట్రం..

Electricity Charges cut off: కరెంట్ ఛార్జీలు ఏటికాయేడు పెంచుకుంటూ పోవడమే కానీ.. తగ్గింపు అనే ముచ్చటే లేదు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేటు సంస్థలు పుట్టుకురావడంతో ప్రతి యేడు కరెంట్ ఛార్జీలు పెరుగడమే కానీ తగ్గడం అనే ప్రసక్తే ఉండటం లేదు. అలాంటి తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బహుశా మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా కరెంట్ ఛార్జీలను తగ్గించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను తగ్గించే నిర్ణయం తీసుకుంది. మొదటి యేడాది 10% తగ్గింపుతో ప్రారంభమై, రాబోయే 5 యేళ్లలో దశలవారీగా  26% వరకు కరెంట్ ఛార్జీలను తగ్గించబోతున్నట్టు ప్రకటించింది. 

Add Zee News as a Preferred Source

టారిఫ్‌లను తగ్గించాలనే MSEDCL ( మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిడెట్) ప్రతిపాదనను ఆమోదించినందుకు మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (MERC)కి ధన్యవాదాలు తెలియజేసారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. గతంలో ఇంతకు ముందు ఎప్పుడూ కరెంట్ ఛార్జీలను తగ్గించేందకు ఎవరు చేయని చర్యగా అభివర్ణించారు.

గతంలో విద్యుత్ సంస్థలు ఎపుడు నష్టాల్లో ఉండేవి. దీంతో అవి ప్రజలపై ఛార్జీల భారం మోపేవి. కానీ ఇపుడు ఎలక్ట్రిఫికేషన్ మ్యాడిపికేషన్ చేసిన కొంత మెరుగు అయింది. అప్పట్లో విద్యుత్ నియంత్రణ మండళ్లు  10% టారిఫ్ పెంపుదల కోసం పిటిషన్లు దాఖలు చేసేవారు. కానీ ఈసారి, తగ్గింపు కోసం పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.  ఇది గృహ, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరి సమానంగా ఈ ప్రయోజనం లభించనున్నట్టు పేర్కొన్నారు. 

రాష్ట్రంలో దాదాపు 70% మంది వినియోగదారులు 100 యూనిట్ల కంటే తక్కువ వినియోగిస్తున్నారు. 10% టారిఫ్ కోత ద్వారా వారు ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశాలున్నాయి. అంతేకాదు విద్యుత్ సంస్థ పనితీరు మెరుగు కావడంతో రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.  మరోవైపు  ముఖ్యమంత్రి సౌర్ కృషి వాహిని యోజన 2.0 పై పని వేగంగా జరుగుతోందన్నారు. చాలా మంది రైతులు, సామాన్యులు సౌర విద్యుత్ ను వాడటంతో మిగిలిన విద్యుత్ ను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.  మా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో పునరుత్పాదక శక్తిపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించినట్టు మహారాష్ట్ర సీఎం చెప్పుకొచ్చారు. అంతేకాదు పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరకే లభిస్తుంది. భవిష్యత్తులో కూడా థర్మల్ విద్యుత్ ను తగ్గించి జల విద్యుత్, పవన్, సౌర, ఇతర పునరుత్పాదక ఇందన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించబోతున్నట్టు చెప్పారు. అలా ఆదా అయిన విద్యుత్ ను వినియోగదారులకు అందజేయడంలో భాగంగా టారీఫ్ లను తగ్గించడం జరిగిందన్నారు. 

Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !

Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News