RCB Winning Emotional Video: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్పు కొట్టింది. ఐపీఎల్ 2025 కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఒక్కసారిగా రాత్రి రోడ్ల పైకి వచ్చి రచ్చ చేశారు. అమీర్‌పేటలో మాత్రమే కాకుండా సెక్రటేరియట్ వద్ద భారీ ఎత్తున యువత సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సినీ తారలతో పాటు రాజకీయ నాయకులు కూడా తమ ఆనందాన్ని నెట్టింటా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడైన అల్లు అయాన్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఆర్‌సీబీ కొట్టగానే ఫుల్ ఎమోషనల్ అయిపోయి తనకు కోహ్లీ అంటే ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఆర్‌సీబీ కప్ కొట్టడంపై అల్లు అర్జున్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. నిరీక్షణ ముగిసింది అన్నారు.
Haha❤️?@alluarjun #RCBvPBKS pic.twitter.com/oAOpCHg5jR
— Bunny - Youth Icon Of India (@BunnyYouthIcon) June 3, 2025
ఆర్సీబీ విక్టరీ బెంగళూరుకు మాత్రమే కాలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ముందుగానే దీపావళి వచ్చింది . హైదరాబాద్ రోడ్లు అన్ని కిక్కిరిసిపోయాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏకంగా రోడ్లపైకి వచ్చి దీపావళి పండుగ చేసుకున్నారు. కప్పు కొట్టారని తెలిసిన వెంటనే టపాసుల మోతలు, తారాజువ్వలు కాంతులు వెలిగాయి. 18 ఏళ్ల తర్వాత కప్పు కొడితే ఆ మాత్రం ఉంటది అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ చేశారు.
చారిత్రాత్మక విజయం: కేంద్ర మంత్రి కుమారస్వామి
ఇక ఆర్సీబీ జట్టుకు కేంద్రమంత్రి కుమారస్వామి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. కన్నడ ప్రజలనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల హృదయాలను ఆర్సీబీ గెల్చుకుందని ఇదొక మైలు రాయి అని.. 18 సంవత్సరాలుగా జట్టులో కొనసాగుతున్న కోహ్లీకి ప్రత్యేక ధన్యవాదాలు. రూ. 6.5 కోట్ల కలను రజత్ పాటీదార్ నిజం చేసిందన్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న విరాట్..
ఇక ఐపీఎల్ ఆర్సీబీ కప్పు గెలవడంతో అద్భుతమైన అనుభూతిని పంచుకున్నారు. విరాట్ కోహ్లీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. 18 ఏళ్ల నా యవ్వనం అనుభవాన్ని టీమ్‌కు ఇచ్చాను. ప్రతి సీజన్లో విజయం కోసం ప్రయత్నించాం. ఐపీఎల్ చివరి మ్యాచ్ వరకు ఈ జట్టుకే ఆడాలనుకున్న ఈ టీంతోనే గెలువాలనుకున్న ఆ కల నిజమైంది. ఈ ఫ్రాంచైజీ గురించి మాటల్లో చెప్పలేను అంటూ నా హాట్ సోల్ బెంగళూరు అని పేర్కొన్నారు.
ఇక ఆర్సీబీ కప్పు కొట్టడం పై విజయ్ మాల్యా కూడా వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుకు వస్తోంది, నా కళ నెరవేరింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతో ప్రత్యేకం. 'ఈ సాల కప్ బెంగుళూరు బరితే' అని ట్విట్ చేశారు. ఈ నేపథ్యంలో నెట్టిజెన్స్ మాత్రం సెటైర్లు వేస్తున్నారు. ఇండియన్స్ మాత్రమే కాదు ఎస్‌బీఐ కల కూడా నెరవేర్చండి కామెంట్స్ చేస్తున్నారు.
When I founded RCB it was my dream that the IPL trophy should come to Bengaluru. I had the privilege of picking the legendary King Kohli as a youngster and it is remarkable that he has stayed with RCB for 18 years. I also had the honour of picking Chris Gayle the Universe Boss…
— Vijay Mallya (@TheVijayMallya) June 3, 2025
ప్రశాంత్ నీల్ సెలబ్రేషన్స్..
ఆర్సీబీ కప్పు కొట్టడంతో సెలబ్రిటీలు ప్రముఖులు పొలిటిషన్స్ చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఒక్కసారిగా సెలబ్రేషన్స్ ఆనందం మిన్నంటింది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ నీల్ సెట్స్ లో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసింది. కప్పు కొట్టగానే కేకలు వేస్తూ గంతులు గెంతులు పెడుతూ చిన్నపిల్లల మారిపోయారు.
Prashant Neel celebration ?❤️#RCBvsPBKS #IPLFinals #ViratKohli?pic.twitter.com/yOHaWB6P6R
— MNV Gowda (@MNVGowda) June 3, 2025
ఇక అయిపోయిన ఫైనల్ ఆర్సీబీ హైదరాబాద్ రోడ్లపై మాత్రం రచ్చ చేశారు. అమీర్ పేట్ కుర్రవాళ్లంతా ఆర్సీబీ అంటూ నినాదాలు చేసి రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఫ్యాన్స్ అల్లరి కాస్త ఎక్కువ అవ్వడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చే ట్రాఫిక్ వాహనాలను ఆపొద్దని వాళ్లను అక్కడి నుంచి వెళ్ళమని వారి స్టైల్ లో అర్థమయ్యేలా చెప్పినట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్ లో కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. అభిమానుల ర్యాలీగా వెళుతూ టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు.
Also Read: Glowing Skin: మెరిసే ముఖానికి ఈ 5 ఫేస్ మాస్కులు వేయాల్సిందే..
Also Read: Honey Mask: తేనెతో ఈ మాస్క్ జుట్టుకు వేయండి.. పట్టులా మెరుస్తూ పెరుగుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









