Basic Pay Scale: కనీస వేతనం కోసం ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం

Employees Goes Protest For Basic Pay Scale: నిబంధనల ప్రకారం తమకు చెల్లించాల్సిన కనీస వేతనాల కోసం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వారు చేపట్టిన ఆందోళన వరుసగా మూడో రోజు చేరుకోగా.. ఉద్యోగులు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదన్నట్టు స్పష్టం చేస్తున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 6, 2025, 09:39 PM IST
Basic Pay Scale: కనీస వేతనం కోసం ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం

Basic Pay Scale: కార్మిక చట్టం ప్రకారం చెల్లించాల్సిన కనీస వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాట పట్టారు. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతుండడంతో ఉద్యోగులు ఉద్యమం చేపట్టారు. వారు చేపట్టిన ఉద్యమం తీవ్రమవుతోంది. వరుసగా మూడో రోజు కూడా ఉద్యోగులు నిరసనకు దిగారు. కనీస వేతనం అమలు చేసే వరకు తాము ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఉద్యోగులు తెలుసా?

Add Zee News as a Preferred Source

Also Read: Sreeleela: స్టార్‌ హీరో కొడుకుతో ప్రేమలో పడ్డ శ్రీలీల? కన్ఫర్మ్ చేసేసిందిగా!

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మిల్క్‌ బాయిలర్స్‌ ఉన్నారు. వారికి చట్ట ప్రకారం కనీస వేతనాలు చెల్లించడం లేదు. పుదుచ్చేరి కార్మిక చట్టం ప్రకారం ప్రభుత్వ అమలు చేయవలసిన కనీస వేతనం అమలు చేయకపోవడంతో యానాం మిల్క్ బాయిలర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన బాట పట్టారు. యానాంలోని జెండా స్తంభం వద్ద మిల్క్ బాయిలర్లు చేపట్టిన ఆందోళన గురువారానికి మూడో రోజుకు చేరింది. కార్మికులు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. ఈ పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు, సంఘీభావం లభిస్తోంది.

Also Read: Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఫైనల్‌కు ముందు కీలక ప్లేయర్ అవుట్

ఈ దీక్షా శిబిరానికి  యానాం కాంగ్రెస్ నాయకులు సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. '23 సంవత్సరాల నుంచి వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మిల్క్ బాయిలర్‌గా పనిచేస్తున్న వందలాదిమంది సిబ్బందికి రూ.10 వేల వేతనం రూ.18 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి రంగస్వామి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం లేదు' అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విమర్శించారు. తక్షణమే జీవో విడుదల చేసి కార్మికుల కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెట్టి చాకిరీ చేస్తున్నా వేతనాలు పెంచకపోవడం దారుణంగా పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News