)
Employees Health Insurance Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ప్రకటన అందించింది. గడువు ముగిసేలోపు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం గడువు పొడిగించింది. మరో ఏడాది పాటు బీమాకు సంబంధించిన గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఉపశమనం కలిగించింది. ఉద్యోగులకు కలిగిన ప్రయోజనం ఏమిటో ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉద్యోగులకు సంబంధించిన కొత్త ఆరోగ్య బీమా పథకం గడువు ఈ సంవత్సరం జూన్ 30వ తేదీతో ముగియనుంది. గతంలో 1 జూలై 2021 నుంచి మరో సంవత్సరం పొడిగించింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా ఉన్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రస్తుత నిబంధనలు, షరతుల ప్రకారం బీమా పొందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షలకు, అనారోగ్యానికి గురయితే అదనంగా రూ.5 లక్షలకు సహాయం అందిస్తారు.
తమిళనాడు ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ 30తో ముగియనున్న కొత్త ఆరోగ్య బీమా పథకం గడువును మరో సంవత్సరం పొడిగించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. దీనికితోడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)పై కూడా త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రీమియం ఇలా
2021 పథకం ప్రకారం ప్రభుత్వం కంపెనీకి చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం నాలుగు సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఉద్యోగి ఏడాదికి రూ.3,240 (జీఎస్టీ అదనం) ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఉద్యోగుల నుంచి అతి తక్కువ ఖర్చు చెల్లిస్తున్నారు. వార్షిక ప్రీమియం నెలవారీ జీతంలో తగ్గింపు ద్వారా ఉద్యోగి నుంచి నెలకు రూ.300 (ఎన్హెచ్ఐఎస్ కోసం రూ.295 సబ్స్క్రిప్షన్ + కార్పస్ ఫండ్ కోసం రూ.5 కంట్రిబ్యూషన్) చొప్పున వసూలు చేస్తున్నారు.
డిసెంబర్ 2021లో ప్రభుత్వం ఉద్యోగులపై ఆధారపడిన పిల్లలకు కూడా ఈ కవరేజీని విస్తరించింది. ఎలాంటి వయో పరిమితి లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.20 (జీఎస్టీ) అదనపు ప్రీమియంతో విస్తరించింది. దీంతో కుటుంబం మొత్తానికి బీమా ప్రయోజనాలు దక్కనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.