Enforcement Directorate: కాంగ్రెస్ పార్టీ సుప్రీమోస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ షాకిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో వారి ఆస్తులని స్వాధీనం చేసుకునేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైంది. ఏప్రిల్ 11న ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సోనియా, రాహుల్ గాంధీలకు మెజారిటీ వాటాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది.
అంతేకాదు రూ. 2000 కోట్ల ఏజెఎల్ ఆస్తులను దుర్మార్గపు పద్దతిలో యంగ్ ఇండియన్ కంపెనీ రూ. 50 లక్షలకు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ కనిపెట్టింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని AJL భవనాలను ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం లోని సెక్షన్ 8 కింద ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఈడీ ప్రకటించింది.
ఇక సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్షనేతతో పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ తన ఏఐసీసీ సమావేశాలను గుజరాత్ లోని కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే కదా.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









