లక్ష కి.మీ. తిరిగి రికార్డు సృష్టించిన తొలి ఇంజిన్‌ రహిత రైలు

భారతలో తొలి ఇంజిన్ రహిత రైలు  వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సరికొత్త రికార్డు సృష్టించింది

Updated: May 16, 2019, 09:41 PM IST
లక్ష కి.మీ. తిరిగి రికార్డు సృష్టించిన తొలి ఇంజిన్‌ రహిత రైలు

భారత దేశంలో తొలి ఇంజిన్‌ రహిత రైలు నిర్వరామంగా లక్ష కి.మీ. తిరిగి సరికొత్త రికార్డు సృష్టించింది.  వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడిచిన ఈ రైలు ఢిల్లీ నుంచి వారణాసి మధ్య మూడు నెలల నుంచి ఒక్క ట్రిప్పు కూడా ఆగిపోకుండా బుధవారంతో లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటించింది. రైలు ప్రారభించిన రోజు మాత్రం కాన్పూర్‌ వద్ద రైలుకు చిన్న బ్రేక్‌ డౌన్‌ అయిందని... అప్పటి నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని రైల్వే అధికారి ఒకరు తెలిపారు . ఈ రైలును ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రధాని మోదీ ప్రారంభించారు