EPFO Big Gift: ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ భారీ శుభవార్త.. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు

EPFO Auto Settlement Advance Increased One Lakh To 5 Lakhs: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ భారీ శుభవార్త ప్రకటించింది. ఇన్నాళ్లు అందిస్తున్న రూ.లక్షను రూ.5 లక్షలకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ 5 లక్షలను ఎలా పొందాలి? వాటికి సంబంధించిన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 24, 2025, 06:59 PM IST
EPFO Big Gift: ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ భారీ శుభవార్త.. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు

Provident Fund Advance Withdraw: భవిష్యత్‌ అవసరాలకు భద్రంగా దాచుకుంటున్న పొదుపు సొమ్మును ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) అంటారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ పీఎఫ్‌లో సభ్యులుగా ఉంటారు. అలాంటి ఉద్యోగులకు పీఎఫ్‌ సంస్థ భారీ శుభవార్త ప్రకటించింది. ఇన్నాళ్లు ఉన్న రూ.లక్షను ఊహించని స్థాయిలో రూ.5 లక్షల పెంచుతూ ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పెంపు ఎలా పొందాలి? ఎవరు అర్హులు వంటి తదితర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ తన చందాదారులకు అడ్వాన్‌ విత్‌డ్రాకు సంబంధించి ఆటో సెటిల్‌మెంట్‌ పరిధిని సవరించింది. అడ్వాన్‌ విత్‌డ్రా ఆటో సెటిల్‌మెంట్‌ ఇన్నాళ్లు రూ.లక్ష ఉంది. ఆ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ ఈపీఎఫ్‌ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇకపై రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు సత్వరమే పరిష్కారం కానున్నాయి. అత్యవసర సమయాల్లో తీసుకునే పీఎఫ్‌ డబ్బుల విషయంలో ఈపీఎఫ్‌ఓ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది.

Also Read: K Kavitha: కొండంత బలం పొందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో ఆటోసెటిల్‌మెంట్‌ విధానాన్ని ఈపీఎఫ్‌ఓ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ అటో సెటిల్‌మెంట్‌ ద్వారా లక్షల మంది ఉద్యోగులు భారీ ప్రయోజనం పొందారు. అనారోగ్యం, వివాహం, ఉన్నత విద్య, ఇళ్లు కొనడం.. నిర్మాణం వంటి అవసరాల కోసం ఈపీఎఫ్‌ ఆటో- సెటిల్‌మెంట్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తాజా పెంపుతో పీఎఫ్‌ సభ్యులు రూ.5 లక్షల వరకు ఆటోమేటిక్‌గా క్లెయిమ్‌ పొందొచ్చు.

72 గంటల్లోనే
ఆటో సెటిల్‌మెంట్‌ పద్ధతిలో క్లెయిమ్‌ అవుతుండడంతో ఎక్కడా కూడా ఆలస్యం కాదు. రూ.5 లక్ష వరకు ఎలాంటి క్లెయిమ్స్‌ ఉన్నా కూడా పరిష్కారమవుతాయి. అర్హత ఉండి కేవైసీ, బ్యాంక్‌ వ్యాలిడేషన్‌ పూర్తయినట్లయితే ఐటీ టూల్స్‌ పేమెంట్‌ను ఆటోమేటిక్‌గా పీఎఫ్‌ను క్లెయిమ్‌ చేస్తుంది. గతంలో 10 రోజుల సమయం పట్టగా ఇప్పుడు కొత్త విధానంతో 3-4 రోజుల్లోనే పీఎఫ్‌ క్లెయిమ్‌ కానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News