EPFO CBT Meeting Major Decisions: భవిష్యత్ అవసరాలకు కొంత పొదుపు చేసే సంస్థ ఈపీఎఫ్‌ఓ. ఉద్యోగులు, కంపెనీల నుంచి కొంత తీసుకుని వడ్డీ జత కట్టి భద్రపర్చే బ్యాంకు వంటిది ఈపీఎఫ్‌ఓ. ఈపీఎఫ్‌ఓ చెల్లించేది భవిష్య నిధి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులతోపాటు పింఛన్‌దారులు ఈపీఎఫ్‌ఓలో ఉంటారు. ఆ సంస్థ తన 238వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశాన్ని సోమవారం నిర్వహించింది. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చలు చేసింది. అనంతరం సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు ఆమోదం తెలిపింది.
Also Read: Schools Holiday: స్కూళ్లకు 13 రోజుల సెలవులు.. నేటి నుంచి ఎప్పటివరకంటే..?
ఈపీఎఫ్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ శుభవార్త వినిపించింది. 3.0 పేరిట కొత్త అవతారం ఎత్తిన ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇకపై సులభతరంగా సేవలు అందించనుంది. పూర్తిగా డిజిటలీకరణ చేస్తుండడంతో ఈ క్రమంలోనే పీఎఫ్ విత్ డ్రా సదుపాయాన్ని మొత్తం ఇవ్వనుంది. వంద శాతం పీఎఫ్ డ్రా చేసుకునేందుకు సీబీటీ సమావేశంలో ఈపీఎఫ్‌ఓ ఆమోదం తెలిపింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు దీపావళి గిఫ్ట్.. ఏమిటో తెలుసా?
సీబీటీ నిర్ణయాలు ఇవే..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పీఎఫ్ నగదును పూర్తిగా విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్‌ఓ ఆమోదం తెలపడం ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. విత్ డ్రా అంశంలో నిబంధనలను ఈపీఎఫ్‌ఓ సరళీకృతం చేసింది. సరళీకృత పాక్షిక ఉపసంహరణలు, పిటిషన్‌లు తగ్గింపు, సభ్యులకు సులభంగా సేవలు అందించేందుకు విశ్వాస్ పథకాన్ని ప్రారంభించింది.
Also Read: PM Surya Ghar: విద్యుత్ బిల్లుతో బాధపడేవారికి జాక్‌పాట్.. ఈ పథకంతో రూ.78 వేలు
కొత్త పథకం
ఈపీఎఫ్ఓ విశ్వాస్ అనే పేరిట కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. యజమాన్యాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించడం లక్ష్యంగా విశ్వాస్ పథకానికి రూపొందించింది. ఈ పథకానికి ఈపీఎఫ్‌వో సీబీటీ ఆమోదం తెలిపింది. జరిమానా నష్టాలకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ విండోను విశ్వాస్ పథకం అందిస్తుంది. స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహిస్తుంది. ఇరువైపులా చట్టపరమైన భారాన్ని సాధ్యమైనంతగా విశ్వాస్ పథకం తగ్గిస్తుంది.
Also Read: CMRF Funds: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.60 కోట్లు విడుదల
ఈపీఎఫ్ఓ సీబీటీ నిర్ణయాలు ఇవే!
13 సంక్లిష్ట విత్‌డ్రా నిబంధనలను 3 వర్గాలుగా విలీనం చేస్తూ నిర్ణయించింది. అత్యవసరాలు (అనారోగ్యం, చదువు, పెళ్లి), గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు
చందాదారులు ఇకపై ఉద్యోగి, యజమాని విరాళాలతో సహా అర్హత కలిగిన బ్యాలెన్స్‌లలో మొత్తం వంద శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.
చదువుకు సంబంధించి విజ్ఞప్తులు పది సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. పెళ్లి కోసం ఐదుసార్లు విత్‌డ్రాకు అనుమతిచ్చారు.
కనీస సేవా వ్యవధిని ఈపీఎఫ్‌ఓ 12 నెలలకు తగ్గించింది.
రిటైర్‌మెంట్ కార్పస్‌ను కాపాడటానికి 25 శాతం కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాలి.
అకాల ఫైనల్ సెటిల్‌మెంట్లు 2 నుంచి 12 నెలల వరకు పొడిగింపు
ఆధార్ ఆధారిత ధృవీకరణతో తుది పెన్షన్ ఉపసంహరణ సాధ్యం.
ఈపీఎఫ్ సంస్థ 30 కోట్ల మందికి పైగా సభ్యులకు డిజిటల్ సేవలు కల్పించడంపై దృష్టి సారించింది. కాగిత రహిత ప్రక్రియలు, రియల్ టైమ్ ఫిర్యాదుల పరిష్కారం, ఏఐ ఆధారిత సర్వీస్ డెలివరీ వంటిని అమలు చేయాలని ఈపీఎఫ్ సీబీటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు. ఈ నిర్ణయాలతో ఉద్యోగులు, పింఛన్‌దారులు, ప్రైవేటు ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది. 3.0 అని చెప్పినట్టుగానే ఖాతాదారులకు సులభంగా పీఎఫ్ సేవలు లభించనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









