PF Interest Rate Calculator: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఉద్యోగులకు లభించిన ఓ దీర్ఘకాలిక సెక్యూర్డ్ పొదుపు పథకం. ప్రభుత్వం ఉద్యోగుల నుంచే కాకుండా వారి యజమానుల వాటాను కలిపి ప్రతి ఏడాది దానిపై వడ్డీని ప్రకటిస్తుంది. అయితే కొందరు ఉద్యోగులు కొన్ని అత్యవసర సమయాల్లో మాత్రం విత్‌డ్రా చేసుకుంటుంటారు. అలా పీఎఫ్ డబ్బును ఏడాది మధ్యలో ఉపసంహరించుకోవడం ద్వారా దానిపై వడ్డీని ఎలా లెక్కిస్తారనేది చాలా మందిలో తొలిచే ప్రశ్న. ఇప్పుడు దీని గురించి ఓ క్లారిటీగా వివరాలను తెలుసుకుందాం.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో పీఎఫ్ ఖాతాదారుల మొత్తంపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. అయితే వడ్డీ గణన ప్రతి నెల ముగింపు బ్యాలెన్స్ ఆధారంగా జరుగుతుంది. ప్రస్తుత పీఎఫ్ డబ్బుపై వడ్డీరేటును 8.25 శాతంగా నిర్ణయించారు. ఈ క్రమంలో నెలకు ఒకసారి వడ్డీ లెక్కించి చివరికి ఖాతాలో జమ చేస్తారు. వడ్డీ ఎలా లెక్కించినా.. పీఎఫ్ ఖాతాలోని డబ్బుకు నెలవారీ వడ్డీ రేటును లెక్కిస్తారని స్పష్టంగా తెలుస్తోంది.
ఒకవేళ ఏడాది మధ్యలో పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసినా.. మిగిలిన పీఎఫ్ మొత్తంపై వడ్డీ లెక్కింపు ఆగదు. ఉదాహణరకు చెప్పాలంటే ఆగస్టు నెలలో మీరు మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు ఉపసంహరించుకుంటే.. ఆ నెల ముందు వరకు ఉన్న డబ్బుపై పూర్తిగా వడ్డీని లెక్కిస్తారు. విత్‌డ్రా చేసిన తర్వాత కొత్త బ్యాలెన్స్‌ను వడ్డీని లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత నెల వడ్డీని కొత్త బ్యాలెన్స్‌పై లెక్కిస్తారు. అయితే వడ్డీ శాతం మాత్రం తగ్గదు. మీ ఖాతాలో పీఎఫ్ డబ్బు తగ్గిన కారణంగా రాబోయే వడ్డీలోనూ కొత్త వ్యత్యాసం ఉంటుంది.
ఉదాహరణకు మీ PF ఖాతాలో ఏప్రిల్‌లో రూ. 2,00,000 మెయిన్‌టైన్ చేస్తూ వచ్చి.. ఆగస్టులో రూ.50,000 వరకు విత్‌డ్రా చేయడం ద్వారా ఏప్రిల్ నుంచి జులై వరకు రూ. 2,00,000 మొత్తంపై వడ్డీని లెక్కిస్తారు. ఆగస్టు తర్వాత మీరు డ్రా చేయగా మిగిలిన రూ.1,50,000 కొత్త బ్యాలెన్స్‌కు కొత్త వడ్డీని లెక్కిస్తారు. దీంతో మీరు గమనించాల్సిందేమిటి అంటే.. ఏడాది మధ్యలో మీ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయడం ద్వారా మీకు ఎలాంటి వడ్డీ నష్టం ఉండదు. మీ రాబోయే వడ్డీ మాత్రం తగ్గుతుంది. మీ ఖాతాలోని మిగిలిన బ్యాలెన్స్‌పై వడ్డీని కచ్చితంగా లెక్కిస్తారు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









