PF UPI ATM Withdrawal: యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ ఎలా విత్ డ్రా చేసుకోవచ్చు

PF UPI ATM Withdrawal: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్త ఫీచర్ ప్రారంభించింది. పీఎఫ్ డబ్బుల్ని తక్షణం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూపీఐ, ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2025, 11:29 AM IST
PF UPI ATM Withdrawal: యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ ఎలా విత్ డ్రా చేసుకోవచ్చు

PF UPI ATM Withdrawal: ఈపీఎఫ్ఓ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సౌకర్యాలు అందిస్తుంటుంది. ఇందులో భాగంగా అద్భుతమైన ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇన్‌స్టంట్ పీఎఫ్ విత్‌డ్రాయల్ లాంచ్ చేసింది. అంతేకాకుండా యూపీఐ ఫీచర్ కూడా ప్రవేశపెట్టింది. 

పీఎఫ్ కస్టమర్లకు తమ పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడంలో ఆలస్యం జరగకుండా, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకునేలా ఈపీఎఫ్ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియాలో భాగంగా ఈపీఎఫ్ఓ కొత్త వెసులుబాటు తీసుకొచ్చింది. ఎలాంటి ఫామ్స్ సమర్పించకుండానే పీఎఫ్ డబ్బుల్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆ‌‌ఫ్‌లైన్ విధానంలో ఫామ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ యాక్సెస్ నేరుగా ఉంటుంది. యూపీఐ, ఏటీఎం నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది. 

యూపీఐ, ఏటీఎం ద్వారా ఎలా విత్ డ్రా చేసుకోవచ్చు

ఈపీఎఫ్ఓకు రిజిస్టర్ అయిన బ్యాంక్ ఎక్కౌంట్ యూపీఐ ఐడీ ఎంటర్ చేయాలి. ఈపీఎఫ్ పోర్టల్‌లో ఇ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో ఇచ్చే సూచనలు ఫాలో కావాలి. యూపీఐ ఐడీ లేదా ఏటీఎం ఆప్షన్ ఎంచుకోవాలి. అంతే మీ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్‌కు యూపీఐ ఎలా లింక్ చేయాలి

ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అవాలి. ఆ తరువాత మేనేజ్ సెక్షన్ నుంచి కేవైసీ సెలెక్ట్ చేయాలి. అదర్ కేటగరీ విభాగంలో యూపీఐ ఐడీ ఎంటర్ చేయాలి. వివరాలు వెరిఫై చేసుకోవాలి. ఒకసారి వివరాలు వెరిఫై అయితే చాలు ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్తో యూపీఐ లింక్ అయిపోతుంది. ఆ తరువాత ఈపీఎఫ్ఓ యాప్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు.

పీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారా ఎలా విత్ డ్రా చేసుకోవచ్చు

ముందు ఈపీఎఫ్ఓ లావాదేవీలు అనుమతించే ఏటీఎంకు వెళ్లాలి. ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్ లింక్ అయిన బ్యాంక్ డెబిట్ కార్డు ఎంటర్ చేయాలి. ఈపీఎఫ్ఓ విత్ డ్రాయల్ ఆప్షన్ ఎంచుకోవాలి. కావల్సిన నగదు మొత్తం ఎంటర్ చేసి విత్ డ్రా చేసుకోవచ్చు. 

Also read: Aadhaar Card: ఒక ఫోన్ నెంబర్‌కు ఎన్ని ఆధార్ కార్డులు అనుసంధానం చేయవచ్చు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News