EPFO Big Update: పీఎఫ్ ఖాతాదారులు ఈ పని పూర్తి చేయకపోతే వెంటనే చేయండి, లేకుంటే నెల జీతం పోతుంది

EPFO Big Update: పీఎఫ్ ఎక్కౌంట్ అనేది ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగికి విధిగా ఉంటుంది. మీ పీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యే నగదుపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో పాటు వడ్డీ చెల్లిస్తుంది. అదే సమయంలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తుంటుంది. అలాంటి ఓ అప్‌డేట్ మీ కోసం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2025, 09:52 PM IST
EPFO Big Update: పీఎఫ్ ఖాతాదారులు ఈ పని పూర్తి చేయకపోతే వెంటనే చేయండి, లేకుంటే నెల జీతం పోతుంది

EPFO Big Update: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పీఎఫ్‌కు సంబంధించి కీలకమైన ప్రక్రియ పూర్తి చేయకుంటే వెంటనే చేసేయండి. లేకపోతే నష్టపోవల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Add Zee News as a Preferred Source

అసంఘటిత రంగంలో పనిచేసేవారికి తప్పించి అందరు ఉద్యోగులకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉంటుంది. ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగి, యజమాని రెండు వైపుల్నించి నిర్దిష్ట మొత్తం ప్రతి నెలా పీఎఫ్ ఎక్కౌంట్‌లో జమ అవుతుంటుంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ కార్యాలయం కీలకమైన అప్‌డేట్ అందించింది. మీ పీఎఫ్ ఎక్కౌంట్ ను తక్షణం యూనివర్సల్ ఎక్కౌంట్ నెంబర్ యాక్టివేట్ చేయాల్సి ఉంది. దాంతో పాటు ఆదార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ గడువు ఫిబ్రవరి 28 వరకు ఉండేది. కానీ ఇప్పుడు చాలామంది పీఎఫ్ ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ గడువు తేదీని పొడిగించింది. మార్చ్ 15 వరకూ పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకుని, ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. ఫిబ్రవరి 28 నుంచి మర్చ్ 15 వరకూ గడువు పొడిగించింది ఈపీఎఫ్ కార్యాలయం. ఒకవేళ ఇప్పుడు కూడా నిర్ణీత గడువులోగా ఈ పన పూర్తి చేయకపోతే ఒక నెల జీతం కోల్పోయే అవకాశం ఉంది. 

ఇప్పటికే చాలామంది పీఎఫ్ ఖాతాదారులు యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకోలేదు. ఆధార్ కార్డు లింకింగ్ పూర్తి చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఆ ఉద్యోగి ఒక నెల జీతం కోల్పోవల్సి వస్తుంది. అంతేకాకుండా ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇనీషియేటివ్ పధకం ప్రయోజనం అందదు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈఎల్ఐ ప్రకారం ఓ నెల జీతం లభిస్తుంది. మీ యూఏఎన్ యాక్టివేషన్, ఆధార్ కార్డు లింక్ పూర్తి చేయాలంటే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ సందర్శిస్తే సులభంగా క్షణాల్లో పూర్తి చేయవచ్చు. 

Also read: Public Holidays: మార్చ్‌లో స్కూల్స్, బ్యాంకులు, ఆఫీసులకు రెండు రోజులు సెలవు ఎందుకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News