EPFO New Rules: ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ కొత్త రూల్స్, మూడ్రోజుల్లోనే క్లెయిమ్స్ సెటిల్

EPFO New Rules: ఈపీఎఫ్ఓ నుంచి మరో కీలకమైన అప్‌డేట్ వెలువడింది. పీఎఫ్ సభ్యులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే అంశమిది. పీఎఫ్ డబ్బుల విత్ డ్రా ఇకపై మరింత సులభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 30, 2025, 10:34 PM IST
EPFO New Rules: ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ కొత్త రూల్స్, మూడ్రోజుల్లోనే క్లెయిమ్స్ సెటిల్

EPFO New Rules: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ జారీ చేస్తుంటుంది. పీఎఫ్ సభ్యుల సౌలభ్యం కోసం అనువైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఈపీఎఫ్ఓ సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై మీరు డబ్బులు విత్ డ్రా చేయాలంటే కేవలం మూడు రోజుల్లోనే మీక్కావల్సిన డబ్బులు పొందవచ్చు.

Add Zee News as a Preferred Source

ఈపీఎఫ్ఓ అనేది ఉద్యోగుల భవిష్య నిధి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తప్పకుండా ఈ ఎక్కౌంట్ ఉంటుంది. ఉద్యోగి నుంచి యజమాని లేదా సంస్థ నుంచి ప్రతి నెలా కొంతమొత్తం ఎక్కౌంట్‌లో జమ అవుతుంటుంది. ఈ నగదుపై కేంద్ర ప్రభుత్వం ఏడాదికోసారి వడ్డీ చెల్లిస్తుంటుంది. పీఎఫ్ డబ్బులు సాధారణంగా రిటైర్మెంట్ వరకూ తీసుకోడానికి వీల్లేదు. కానీ ఎప్పుడైనా మెడికల్, పెళ్లి ఖర్చులు, పిల్లల చదువులు వంటి అత్యవసరాలకు కొంతమొత్తం విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే దీనికి సమయం పడుతుంటుంది. కానీ ఈపీఎఫ్ఓ ఈ విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. 

ప్రస్తుతం 60 శాతం వరకూ క్లెయిమ్స్ ఆటోమేటిక్ ప్రాసెస్ అవుతున్నాయి. లక్ష రూపాయల వరకూ ఉన్న క్లెయిమ్స్ మూడు రోజుల్లో పొందవచ్చు. ముఖ్యంగా అనారోగ్యం, ఆసుపత్రి ఖర్చులు, ఇంటి కొనుగోలు, పిల్లల చదువులు, వివాహం కోసం క్లెయిమ్స్ త్వరగా క్లియర్ చేస్తారు. మీ యూఏఎన్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే చాలు. ఈపీఎఫ్ఓ యాప్ ఓపెన్ చేసి ఆన్‌లైన్ విధానంలో క్లెయిమ్ చేయవచ్చు. 

పీఎఫ్ సంబంధిత వ్యవహారాలు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సులభం. మీ యూఏఎన్ నెంబర్ ఆధార్ కార్డులో అనుసంధానమై ఉంటే అంతా ఈజీనే. యాజమాన్యంతో సంబంధం లేకుండానే మీ పాత పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త ఎక్కౌంట్‌కు మార్చుకోవచ్చు. దీనికోసం గతంలో చెక్ లీఫ్ లేదా పాస్‌బుక్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. 

ఈపీఎఫ్ఓ సభ్యులు డబ్బులు విత్ డ్రా క్లెయిమ్ చేసేముందు అర్హత ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 7.14 కోట్ల క్లెయిమ్స్ ఆన్‌లైన్ ద్వారా దాఖలయ్యాయి. త్వరలో పీఎఫ్ డబ్బుల్ని డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి డ్రా చేసుకున్నట్టు చేసుకోవచ్చు. ఇది కాకుండా యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే విధంగా చర్చలు నడుస్తున్నాయి. 

Also read: TDP Panchangam: మరో రెండు పర్యాయాలు చంద్రబాబే సీఎం, మాడుగుల పంచాంగంతో టీడీపీలో జోష్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News