EPFO Insurance: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అందిస్తుంది. ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పధకంలో భాగంగా 7 లక్షల బీమా సదుపాయం వర్తిస్తుంది. ఉద్యోగులు లేదా ఖాతాదారుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండానే ఈ బీమా సౌకర్యం లభిస్తుంది.
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అందరికీ తప్పనిసరిగా కలిగి ఉండేది పీఎఫ్ ఎక్కౌంట్. ఇందులో ఉద్యోగి, సంస్థ నుంచి ప్రతి నెలా కొద్దిమొత్తం జమ అవుతుంటుంది. ఈ మొత్తంపై ఏడాదికోసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. అయితే అందరికీ తెలిసినట్టుగా పీఎఫ్ ఎక్కౌంట్‌తో కేవలం పీఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ మాత్రమే కాకుండా ఇతర లాభాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 1952 ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ అండ్ మిస్సెల్లేనియస్ ప్రోవిజన్స్ యాక్ట్ ప్రకారం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది. వాస్తవం ఏంటంటే చాలామంది ఉద్యోగులకు పీఎఫ్ ఎక్కౌంట్‌తో పాటు బీమా సదుపాయం ఉందని తెలియదు. ఈ ఇన్సూరెన్స్ ఈఎల్‌డీఐ స్కీమ్ ప్రకారం అందుతుంది.
ఈఎల్‌డీఐ అంటే ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇందులో జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది. ఆర్గనైజ్డ్ రంగంలో పనిచేసే ఉద్యోగికి ఈపీఎఫ్ఓ ఈ ఇన్సూరెన్స్ అందిస్తుంది. దురదృష్టవశాత్తూ ఉద్యోగి అకాల మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి ఆర్ధికంగా రక్షణ కల్గించే క్రమంలో ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుతుంది.
ఈ స్కీమ్‌లో కనీసం 2.5 లక్షలు గరిష్టంగా 7 లక్షలు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఉద్యోగి ఏ విధమైన డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రీమియం సంస్థ లేదా యజమాని చెల్లిస్తారు. ఈ ప్రీమియం అనేది నెలకు 75 రూపాయలు లేదా బేసిక్ శాలరీలో 0.5 శాతం ఉంటుంది. ఉద్యోగి గత 1 నెలల సరాసరి జీతం ఆధారంగా ఇన్సూరెన్స్ మొత్తం ఎంతనేది నిర్ణయిస్తారు. గరిష్టంగా 7 లక్షలు ఉంటుంది. పీఎఫ్ సభ్యులందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈపీఎఫ్‌లో సభ్యులైన ప్రతి ఉద్యోగికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. విడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
ఎలా క్లెయిమ్ చేసుకోవాలి
ఉద్యోగి నామినీ లేదా లీగల్ వారసులు ఫామ్ 51ఎఫ్‌ను ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి. మరణించిన ఉద్యోగి డెత్ సర్టిఫికేట్, నామినేషన్ ప్రూఫ్, క్లెయిమ్ చేసే వ్యక్తి ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్లు అవసరమౌతాయి.
Also read: School Holidays: విద్యార్ధులకు సూపర్ గుడ్‌న్యూస్, ఏప్రిల్ లో 3-4 రోజులు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









