)
Epfo Pension Hike 2025 Telugu: బెంగళూరులో EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) మీటింగ్ రెండు రోజులపాటు జరగబోతోంది. ఇది శుక్రవారం ప్రారంభమై శనివారం ముగుస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈపీఎఫ్ కు సంబంధించిన అనేక అంశాలను చర్చించుకోబోతున్నట్లు అధికారిక సమాచారం. ముఖ్యంగా దీపావళి సందర్భంగా ఉద్యోగులకు పెన్షన్ పెంచే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల నెలవారీ కనీస పెన్షన్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి..
EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం అక్టోబర్ 10 నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగుల కనీస పెన్షన్ రూ. 1000 నుంచి రూ.2,500 వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు విపరీతంగా వస్తే. ఈ నిర్ణయం తీసుకుంటే కొన్ని కోట్ల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఈ సమావేశంలో భాగంగా పెన్షన్ పెంచే ప్రతిపాదనను ఆమోదిస్తే.. 11 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ భారీగా పెరుగుతుంది. 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతినెల కనీస పెన్షన్ రూ.1000 నిర్ణయించింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏమాత్రం పెరగనే లేదు..
CBT సమావేశంలో భాగంగా పెన్షన్ పెరిగితే దాదాపు మూడు మిలియన్లకు పైగా ఉద్యోగులకు కనీస పెన్షన్ పెరుగుతుందని సమాచారం. ఇది ఇలా ఉంటే పెన్షన్ అర్హుల వివరాల్లోకి వెళితే.. ఈ పెన్షన్ పొందడానికి తప్పకుండా ఏదైనా ఒక సంస్థలో లేదా వివిధ సంస్థల్లో 10 సంవత్సరాల పాటు నిరంతరం సేవలు అందించాల్సి ఉంటుంది. అలాగే ఈ సంస్థలు ఈపీఎఫ్ ఖాతాల్లో కొన్ని డబ్బులు జమ చేయాల్సి కూడా ఉంటుంది. ఇలా జరిగితేనే 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత EPS కింద రెగ్యులర్ పెన్షన్ అరకులవుతారని సమాచారం..
EPS 95 పెన్షన్ పథకం అంటే ఏమిటి?
1995 సంవత్సరం నవంబర్ 19న ఈపీఎఫ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరికి అప్పటినుంచి పెన్షన్‌ను అందిస్తూ వస్తోంది. దీనిని 95 సంవత్సరంలో ప్రారంభించడం వల్ల అప్పటినుంచి EPS 95 పెన్షన్ పథకం అని పేరు వచ్చింది. ఇక ఈ పథకం కింద పెన్షన్ పొందడానికి ఉద్యోగికి తప్పకుండా 58 సంవత్సరాలు ఏళ్లు నిండి ఉండాల్సి ఉంటుంది. ఆధార్ ప్రకారం 58 ఏళ్లు నిండిన వ్యక్తులకే ఈపీఎఫ్ పెన్షన్ లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి