EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, 5 లక్షల వరకు విత్‌డ్రా

EPFO News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. అత్యవసరంగా డబ్బులు కావల్సినప్పుడు వీలు కల్పిస్తోంది. ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని గణనీయంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 25, 2025, 01:06 PM IST
EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, 5 లక్షల వరకు విత్‌డ్రా

EPFO News: కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ సభ్యులకు శుభవార్త విన్పించింది. ఇకపై పీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లు ఏ విధమైన వెరిఫికేషన్ లేకుండా అదనపు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఆటో సెటిల్‌‌మెంట్ లిమిట్ పెంచింది. 

Add Zee News as a Preferred Source

ఈపీఎఫ్ ఖాతాదారులకు ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకూ లిమిట్ పెంచింది. అత్యవసరంగా డబ్బులు కావల్సినప్పుడు ఏ విధమైన మేన్యువల్ వెరిఫికేషన్ లేకుండా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ముందస్తు క్లెయిమ్ కోసం ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని గణనీయంగా పెంచింది. ఈ పరిమితిని 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూఖ్ మాండవియా తెలిపారు. ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది. 

వాస్తవానికి ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్‌మెంట్ సౌకర్యాన్ని కోవిడ్ సమయంలో ప్రవేశపెట్టింది. ఖాతాదారులకు ఆర్ధిక సహాయం అందించేందుకు ఈ క్లెయిమ్ విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం అనారోగ్యం, విద్య, వివాహం, గృహ ప్రయోజనాల కోసం అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ క్లెయిమ్ ప్రకారం 1 లక్ష రూపాయలు పరిమితి ఉండేది. ఇందులో క్లెయిమ్ చేసినప్పుడు ఎలాంటి వెరిఫికేషన్ అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా అంతా ప్రోసెస్ అవుతుంది. ఈపీఎఫ్ఓ సేవలను మరింత పారదర్శకం చేసేందుకు, ఖాతాదారులకు అనుకూలంగా ఉండేందుకు ఈ సంస్కరణలు ప్రవేశపెట్టింది. గత ఏడాది అంటే 2024-25లో ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్‌మెంట్ ద్వారా 2.34 కోట్ల క్లెయిమ్స్ ప్రోసెస్ అయ్యాయి. అంతకు ముందు అంటే 2023-24లో 89.52 లక్షల క్లెయిమ్స్ ప్రోసెస్ అయ్యాయి. వీటిలో 59 శాతం ఆటోమోడ్ విధానంలో పరిష్కరించబడ్డాయి. ఇప్పుడు ఆటో సెటిల్‌మెంట్ పరిమితి పెంచడంతో ఈపీఎఫ్ ఖాతాదారులకు మరింత దోహదం కలగనుంది. 

Also read: Heavy Rains: గుజరాత్ ను వణికిస్తున్న వానలు..వరదలతో అతలాకుతలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News