Female Youtuber video: బెడ్ రూమ్‌లో ప్రియుడితో రాసలీలల్లో లేడీ యూట్యూబర్.. భర్త ఏంచేశాడంటే..?

Haryana lady youtuber case: హర్యానాకు చెందిన రవీనా అనే లేడీ యూట్యూబర్ కు ఇన్ స్టాలో ఒక సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలసి తరచుగా మాట్లాడుకుంటూ, సీక్రెట్ గా కలుసుకునేవారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 16, 2025, 02:51 PM IST
  • భర్తను చంపిన లేడీ య్యూబర్..
  • హర్యానాలో మరో షాకింగ్ ఘటన..
Female Youtuber video: బెడ్ రూమ్‌లో ప్రియుడితో రాసలీలల్లో లేడీ యూట్యూబర్.. భర్త ఏంచేశాడంటే..?

Female Youtuber killed her husband with lover in Haryana: ఇటీవల కాలంలో సమాజంలో తరచుగా వివాహేతర సంబంధాలకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఒకప్పుడు భర్తలు తమ భార్యల్ని వేధించేవారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. చాలా చోట్ల భార్యలు తమ భర్తల్ని వేధించడమే కాకుండా.. లవర్ ల మోజులో పడి హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే యూపీలో జరిగిన మర్చంట్ నేవీ అధికారి హత్య ఘటన మరువక ముందే మరో ఘటన షాకింగ్ కు గురిచేసేదిగా మారింది. ఈ ఘటన ప్రస్తుతం హర్యానాలో చోటు చేసుకుంది.

Add Zee News as a Preferred Source

హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భివానీలో  ఉంటున్న రవీనా అనే యూట్యూబర్, ప్రవీణ్ (35)లకు గత 2017లో వివాహమైంది. వీరికి ఆరేళ్ళ కుమారుడు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రవీనాకు.. రెండెళ్ల క్రితం ఇన్ స్టాలో సురేష్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వీరి మధ్య చనువు పెరిగి.. వివాహేతర సంబంధంకు దారితీసింది.

 

ఇద్దరు కూడా తరచుగా కలుసుకునే వారు.  ఈ విషయం కాస్త భర్తకు తెలిసింది. దీంతో తరచుగా ఇంట్లో గొడవలు జరిగేవి.  ఇక వీళ్ల టార్చర్ భరించలేక.. భర్త మద్యానికి బానిసయ్యాడు.  దీంతో అతని పీడ వదిలించుకుని ప్రియుడుతో కలిసివుండాలన్న భార్య ప్లాన్ చేసింది.  గత నెల 25వ తేదీన రవీనా ఇంటికి ప్రియుడు సురేష్ వచ్చాడు. ఇద్దరు కూడా ఇంట్లోనే రొమాన్స్ చేసుకుంటు ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో భర్త ప్రవీణ్ భార్యపై, ఆమె ప్రియుడిపై  దాడికి దిగాడు.

 మద్యం సేవించి ఉండటంతో భార్య, ప్రియుడు  కలిసి అతనిపైన దాడికి దిగారు. కత్తితో భార్య భర్త పీకను కొసింది. ప్రియుడు , అతడ్ని అరవకుండా.. నోటిలో బట్టలు కుక్కాడు.  ఆ తర్వాత అర్థరాత్రి 2.30 గంటల సమయంలో మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లి కాలువలో పడేశాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు భార్య నాటకాలు మొదలెట్టింది. దీంతో పోలీసులు ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో సీసీటీవీ ఫుటేజీలను గమనించారు.

Read more: Vincy aloshious Video: నా ముందే డ్రెస్ మార్చుకోమ్మని హీరో టార్చర్..!.. షాకింగ్ నిజం బైటపెట్టిన హీరోయిన్.. వీడియో వైరల్..

 రవీనా, సురేష్‌లు బైకుపై ప్రయాణిస్తున్నట్టు, వారి మధ్యలో ప్రవీణ్ మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు రవీనా అనే యూట్యూబర్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారణ జరపగా.. దారుణం గురించి బైటపెట్టింది. ప్రస్తుతం ఆమె ప్రియుడు సురేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ ఘటన ప్రస్తుతం హర్యానాలో సంచలనంగా మారింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News