)
Rail Neer Water Bottle Price Cut: ప్రపంచంలోనే అత్యంత నెట్వర్క్.. సుదీర్ఘ రైల్వే లైన్ కలిగినది భారతీయ రైల్వే. దేశ ప్రజలకు ప్రయాణానికి ఉపయోగపడుతూనే దేశ ఆర్థిక రంగానికి భారీ ఊతం రైల్వే శాఖ ఇస్తోంది. అలాంటి రైల్వే శాఖ ప్రజలకు భారీ శుభవార్త ప్రకటించింది. సమోసా కన్నా తక్కువ ధరకే నీళ్ల బాటిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే శాఖ తీసుకువచ్చిన నీళ్ల బాటిల్ ధరను మరింత తగ్గించింది. ఇకపై రూ.14 కే అందిస్తామన రైల్వే శాఖ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ రైల్వే శాఖ సొంతంగా రైల్ నీరు పేరిట బ్రాండ్ తీసుకువచ్చి వాటర్ బాటిల్‌ను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇతర బ్రాండ్ల నీటి సీసాల ధరలు భారీగా ఉండగా.. రైల్వే శాఖ అందించే రైల్ నీరు బాటిల్ రూ.15కు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రయాణికులకు ఎంతో మేలు చేసింది. ప్రయాణాల్లో.. రైల్వే స్టేషన్లలో రైల్ నీరు విక్రయాలు కొనసాగుతున్నాయి. తాజాగా వాటి ధర తగ్గిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ రైల్ నీర్ బ్రాండ్ కింద విక్రయించే ప్యాకేజ్డ్ తాగునీటి ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 22 సెప్టెంబర్ నుంచి ఒక లీటర్ రైల్ నీర్ బాటిల్ ధర రూ.15 నుంచి రూ.14కే లభిస్తుంది. 500 మి.లీ బాటిల్ ధర రూ.10కి బదులుగా రూ.9కి విక్రయిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో విక్రయించే రైల్ నీర్, ఇతర షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ల గరిష్ట రిటైల్ ధరను సవరిస్తూ రైల్వే బోర్డు, ఆర్థిక డైరెక్టరేట్ ఆమోదంతో ఓ ప్రకటన విడుదల చేశారు.
'ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ రైల్ నీర్ గరిష్ట రిటైల్ ధరను లీటర్ బాటిల్‌కు రూ.15 నుంచి రూ.14కు, 500 మి.లీ సామర్థ్యం బాటిల్‌కు రూ.10 నుంచి రూ.9కు ధర సవరించాం. ఐఆర్సీటీసీ/రైల్వేస్ ఆమోదించిన ఇతర ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్లకు కూడా ఇదే రేట్లు వర్తిస్తాయి' అని అధికారిక ఉత్తర్వుల్లో రైల్వే శాఖ స్పష్టంగా తెలిపింది. ఈ నిర్ణయంతో లక్షలాది ప్రయాణికులకు ఊరట కలగనుంది. ఈ ధర తగ్గింపుతో ప్రయాణికులకు, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారికి నేరుగా ప్రయోజనం లభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook