)
Jaipur Hospital Fire: జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ (SMS) ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు రోగులు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ట్రామా సెంటర్లోని రెండవ అంతస్తులో ఉన్న న్యూరో ICU వార్డులోని స్టోర్‌లో ఈ సంఘటన జరిగింది. రాత్రి 11:20 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్టోర్‌లో నిల్వ చేసిన పేపర్, ICU పరికరాలు, బ్లడ్ శాంప్లర్ ట్యూబ్‌లు మంటల్లో చిక్కుకున్నాయి. ఆ తర్వాత విషపూరిత పొగ ICU ని నిండిపోయింది.
ట్రామా సెంటర్, ఆసుపత్రి ఐసియుతో సహా మొత్తం 24 మంది రోగులు ఉన్నారు. వారందరి పరిస్థితి విషమంగా ఉంది. మంటలు చెలరేగిన వెంటనే, రోగులను అక్కడి నుండి తరలించారు. 11 మంది రోగుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఆసుపత్రిలో మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో మొత్తం వార్డు బూడిదైంది.
ఐసియులో చేరిన రోగుల బంధువులు ఆసుపత్రి నిర్లక్ష్యంపై ఆరోపించారు. పొగ వ్యాపించిన వెంటనే వార్డ్ బాయ్, ఇతర సిబ్బంది కనిపించకుండా పోయారని బాధితుల కుటుంబాలు చెబుతున్నాయి. రోగులను తరలించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. రోగుల కుటుంబాలే రంగంలోకి దిగి తమ వారిని కాపాడుకున్నట్లు చెబుతున్నారు. ఆసుపత్రి మొత్తంగా భారీగా పొగ అలుముకోవడంతో ఆరుగురిని రక్షించలేకపోయమాని ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు.
ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ వెంటనే ఎస్ఎంఎస్ ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆయనతో పాటు ఆరోగ్య మంత్రి జవహర్ సింగ్ బేధం కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి ఉచిత చికిత్సను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదని, దోషులను వదిలిపెట్టబోమని పేర్కొంటూ, దర్యాప్తు చేయాలని ఆసుపత్రి యంత్రాంగానికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ జైపూర్‌లోని అతిపెద్ద ఆసుపత్రి, రాజస్థాన్ నలుమూలల నుండి చికిత్స కోసం ప్రజలు ఈ ఆసుపత్రికి వస్తుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.