గువహటి షాపింగ్ మాల్ వెలుపల పేలుడు.. ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు

షాపింగ్ మాల్ వెలుపల పేలుడు.. ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

Updated: May 15, 2019, 09:33 PM IST
గువహటి షాపింగ్ మాల్ వెలుపల పేలుడు.. ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు
ANI photo

గువహటి: అస్సాం రాజధాని గువహటి బుధవారం రాత్రి ఉన్నట్టుండి ఉలిక్కిపడింది. జూ రోడ్‌లో వున్న ఓ షాపింగ్ మాల్ వెలుపల గ్రనేడ్ పేలుడు చోటుచేసుకుంది. ప్రస్తుతానికి అందుతోన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పేలుడులో ఇద్దరు మృతిచెందగా ఆరుగురు గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని గువహటి మెడికల్ కాలేజీకి తరలించారు.