Four aunts brutally killed 17 day old nephew due to wedding delay in jodhpur: మన దేశం ప్రతిరోజు టెక్నాలజీ రంగంలో దూసుకునిపోతుంది. కొత్తగా అప్ డేట్ అవుతున్నారు. అయిన కూడా కొంత మంది మూఢనమ్మకాలతో మరింత దిగజరీ ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికి కూడా చాతబడి , బాణామతి, మంత్రాలు అంటూ తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. దీనిలో ఎక్కువ మంది చదువుకున్న వారు ఇలాంటి దొంగ బాబాలు, అఘోరాల బారినపడి అడ్డంగా మోసపోతున్నారు. ప్రస్తుతం కొంత మంది ఈ నమ్మకాలతో హత్యలు చేయడానికికూడా వెనుకాడటం లేదు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో నలుగురు అక్కాచెల్లెళ్ల ఘటన దేశంలో సంచలనంగా మారింది.
अंधविश्वास का वीडियो वायरल । इन मौसियों ने कर दी 16 दिन के मासूम बच्चे की हत्या । जोधपुर के पांच बत्ती क्षेत्र के नेहरू कॉलोनी की है घटना । आप देख सकते हैं कि किस तरह एक अंधविश्वास ने एक मासूम बच्चे की जान ले ली है ।
जोधपुर की सबसे शर्मनाक घटनाक्रम।#jodhpur #news #dixitparihar pic.twitter.com/HAVCFx3GYd— Dixit Parihar (@dixitparihar) November 15, 2025
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని.. జోధ్‌పూర్‌కు చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లకు గత కొన్నేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఒక్కటి కూడా సెట్ కావడంలేదు. దీంతో ఎవరు ఏంచెపితే అది పాటించారు. చాలా మంది పెళ్లి చూపులకు రావడం మరల వెనక్కువెల్లిపోవడం చేస్తున్నారు. అసలు ఎందుకు రిజక్ట్ చేస్తున్నారో కూడా చెప్పడం లేదు.
దీంతో ఇటీవల వీరు ఒక మాంత్రికుడ్ని కలవగా.. అతను ఏడాదిలోపు రోజుల బాలుడ్ని బలిస్తే ఈ పెళ్లి దోషం పొతుందని చెప్పాడంట. దీంతో వీరు.. తమకు వరసకు బావయ్యే వ్యక్తి 17రోజుల కొడుకును ఆడించడానికి అని ఇంట్లో తెచ్చుకున్నారు.ఆ తర్వాత ఏవేవో మంత్రాలు పఠిస్తు.. బాలుడ్ని అత్యంత ఘోరంగా ఊపిరాడకుండా చేసి, ఆ బాబును భెరు దేవుడికి బలిచ్చారు. ఈ ఘటనను ఎవరొ వీడియో కూడా తీశారు. దీనిలో అక్కాచెల్లెల్లు మంత్రాలు చదువుతూ.. ఒడిలో బాలుడ్ని పెట్టుకుని చంపుతున్నారు.
మొత్తంగా ఈ ఘటన తర్వాత బాలుడి కోసం తల్లిదండ్రులువెతకగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు బిడ్డను విగత జీవిగా ఉండటం చూసి గుండెలు పగిలేలా రోదించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు చెందిన వీడియో పోలీసుల చేతికి చిక్కింది. మరోవైపు.. తనకొడును పొట్టన పెట్టుకున్నవాళ్లను కఠినంగా శిక్షించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. మొత్తంగా ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









