Four days work in india under new labour codes: కేంద్రం ఇటీవల గతంలో ఉన్న పాత కార్మిక చట్టాలనురద్దు చేసింది. వీటి స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొని వచ్చింది. అయితే.. వారానికి 48 గంటల పని పరిమితితో, కంపెనీలు 12 గంటల షిఫ్టులను అమలు చేయవచ్చని తెలిపింది. ఈ విధానంతో ఉద్యోగులకు పనిభారం తగ్గడంతో పాటు, మూడు రోజుల సెలవులు కలిసివస్తాయని తెలిపింది. వారంలో నాలుగు రోజుల పని విధానంను ఇప్పటికే..జపాన్, స్పెయిన్, జర్మనీ వంటిదేశాలు అమలు చేస్తున్నాయి. దీంతో మూడు రోజుల సెలవుల్ని మనదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని గత కొన్ని నెలలుగా విపరీతంగా డిమాండ్ వస్తుంది.
అయితే.. దీనిపై విపరీతంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఇటీవల దీనిపై క్లారిటీ ఇచ్చింది. మొత్తంగా.. వారానికి నాలుగు రోజుల పని, మూడు రోజుల సెలవులు లభించాలంటే.. కొత్తకార్మిక కోడ్ ప్రకారం..వారంలో గరిష్టంగా 48 గంటల పని చేయాల్సివస్తుందని తెలిపింది. అంటే రోజుకు 12 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ పన్నెండు గంటల కంటేఅధికంగా పనిచేస్తే జీతం డబుల్ఇవ్వాల్సి ఉంటుందని క్లారిటీఇచ్చింది. మొత్తంగా పలు మార్లు కార్మిక శాఖ దీనిపై క్లారిటీ ఇచ్చిన కూడా దీనిపై ఉద్యోగులుమాత్రం భిన్నమైన తమ అనుమానాలను లెవనెత్తుతున్నారు.
మరోవైపు ఇప్పటికే ముంబై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్ లో కూడా ఈ విధానంపై ముందుకు వెళ్లాలని నెట్టింట పోస్ట్ లు చేస్తున్నారు. మొత్తంగా దీనిపై మరింత క్లారిటీగా ఏదో ఒక ప్రకటన వచ్చేవరకు ఈ సస్పెన్స్ కు తెరపడదని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









