Free Education: త్వరలో కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కానుంది. వేసవి సెలవులు ముగిసిన తరువాత పిల్లలకు కొత్త స్కూల్స్‌లో చదివించేందుకు సిద్ధమౌతుంటారు. కార్పొరేట్ స్కూల్స్‌లో భారీ ఫీజులు చెల్లించకుండా ఉచితంగా చదివించవచ్చు. ఎందుకంటే ఈ మేరకు ఓ చట్టం ఉంది. ఇది చాలా మందికి తెలియదు కూడా.
ప్రైవేట్ స్కూల్స్‌లో 25 శాతం సీట్లను ఉచితంగా అందించాల్సి ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం ప్రతి కార్పొరేట్ కళాశాల మొదటి తరగతిలో 25 శాతం సీట్లను పేద విద్యార్ధులు ఉచితంగా అందించాల్సి ఉంది. ఈ చట్టం ద్వారా ఉచితంగా సీటు పొందాలంటే ఆ కుటుంబ వార్షిక ఆదాయం 1 లక్ష రూపాయల్లోపుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అనాథ పిల్లలు, దివ్యాంగులు, కూలీల పిల్లలు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న మౌళిక పాఠశాల పరిధిలో నివసించేవాళ్లు ఈ పథకానికి అర్హులు.
కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచితంగా చదవాలంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రతి రాష్ట్రంలోని విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. దీనికోసం కావల్సిందల్లా విద్యార్థి పుట్టిన సర్టిఫికేట్, ఇన్‌కం సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, రెసిడెన్స్ సర్టిఫికేట్, దివ్యాంగ సర్టిఫికేట్ అవసరం. మీ నివాసానికి దగ్గరలోని స్కూల్ ఎంచుకోవచ్చు. ఏదైనా పాఠశాల ఉచితంగా సీటు ఇచ్చేందుకు నిరాకరిస్తే జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
Also read: IPL 2025 New Venues: ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త వేదికలు, కొత్త షెడ్యూల్ ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









