Bank Holidays: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?

Three Days Bank Holidays From June 27th To June 29 Here Full Details: బ్యాంకు లావాదేవీలు జరిపే ఖాతాదారులకు అలర్ట్‌. వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి. బ్యాంకు సేవల కోసం వెళ్లే వారు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 26, 2025, 03:02 PM IST
Bank Holidays: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?

3 Days Bank Holidays: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌. ఏమైనా బ్యాంకు లావాదేవీలు.. సేవలు పొందాలనుకుంటే ఈ విషయం తెలుసుకోండి. రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు మాత్రమే సెలవులు ఉండనుండగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మూడు రోజులు సెలవులు ఉన్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సెలవులు ఉండగా.. తిరిగి బ్యాంకులు సోమవారం తెరచుకోనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. ఆ పథకం మరో ఏడాది పొడిగింపు

జూన్‌ నెల ముగింపు సమయంలో కూడా బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన క్యాలెండర్‌తోపాటు ఆయా రాష్ట్రాల స్థానిక బ్యాంకు ఆదేశాల మేరకు మూడు రోజులు సెలవులు వచ్చాయి. బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవులతో సహా 3 సెలవులు లభించాయి. జూన్ 27వ తేదీన దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ్‌ రథయాత్ర ఒడిశాలో జరగనుంది.

రథయాత్రను పురస్కరించుకుని ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తున్నారు. ఈ రోజు మణిపూర్‌లో కూడా బ్యాంకులకు సెలవు ఉంది. ఆ రోజు బ్యాంకులు బంద్‌ ఉండగా.. ఆ తర్వాతి రోజు జూన్ 28న నాలుగో శనివారం, జూన్‌ 29వ తేదీ ఆదివారం కావడంతో మూడు రోజులు సెలవు కలిసి రానున్నాయి. దేశవ్యాప్తంగా నాలుగో శనివారం, ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. మిజోరం రాష్ట్రంలో అయితే సోమవారం కూడా సెలవు ఉండడం విశేషం. రెమ్నా ని సందర్భంగా మిజోరంలో జూన్‌ 30వ తేదీ బ్యాంకులు మూతపడనున్నాయి.

Also Read: Manchu Vishnu Raids: 'భక్త కన్నప్ప'కు భారీ గండం.. మంచు విష్ణు ఆఫీస్‌పై ఐటీ, జీఎస్టీ దాడులు

జూన్ 27 శుక్రవారం: రథయాత్ర / కాంగ్ (రథజాత్ర) - ఒడిశా, మణిపూర్‌లలో బ్యాంకులకు సెలవు
జూన్ 28 నాలుగో శనివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 29 ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.
జూన్ 30 సోమవారం: రెమ్నా ని - మిజోరంలో బ్యాంకులకు సెలవు

ఆన్‌లైన్‌ సేవలు
వరుస సెలవుల నేపథ్యంలో బ్యాంకు సేవలు పొందాలనుకున్న ఖాతాదారులు అత్యవసరమైతే ఆన్‌లైన్‌ ద్వారా సేవలు పొందవచ్చు. ప్రత్యక్షంగా బ్యాంకు శాఖలు సోమవారం తెరచుకోనున్నాయి. బ్యాంకింగ్ సేవలు డిజిటల్ మార్గాల ద్వారా నిరాటంకంగా కొనసాగుతుండడంతో ఖాతాదారులు యాప్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు లావాదేవీలు చేసుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News