)
Truck Rams During Ganesh Visarjan: ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో హసన్ తాలూకాలోని హోసానహళ్లి గ్రామం గణేష్ నిమజ్జనంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వందలాది మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొన్న సమయంలో ఓ ట్రక్కు అతివేగంగా భక్తులపై దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాద స్థితిని చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే పోలీసుల వివరాల ప్రకారం ట్రక్కుకు హఠాత్తుగా వెహికల్ అడ్డురావడంతో దాని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వినాయక నిమజ్జనం భక్తుల వైపుగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉందని తెలుస్తుంది. ఒక చనిపోయిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారని పోలీసులు ధ్రవీకరించారు. వీరిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
అయితే, డ్రైవర్ నియంత్రణ కోల్పోగా దాని చక్రాల కింద పడి నలిగిపోయి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతావారు కాసేపటి తర్వాత ప్రాణాలు వదిలారు. వెంటనే పోలీసు ఇతర సహాయక యంత్రాంగం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయపడ్డారన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Visuals ⚠️ Horrific tragedy in Hassan, Karnataka: A speeding tanker truck rammed into a Ganesh festival procession on NH-373 near Mosalehosalli village.
4 dead on the spot, 20+ seriously injured. Rescue ops underway. Intentions unknown pic.twitter.com/9goQ3d4cOG
— Operation Unfiltered ?? (@LakshyaAwasth) September 13, 2025
అయితే బస్సు డ్రైవర్ భువనేష్ నియంత్రణ కోల్పోవడంతో జరిగింది. ట్రక్కు ఓ లాజిస్టిక్ కంపెనీకి చెందిందిగా పోలీసులు గుర్తించారు. ఇక ఎక్స్ వేదిక సిద్ధరామయ్య కూడా మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. హఠాత్తుగా జరిగిన ప్రమాదం ఎంతోమంది తీవ్ర గాయాల పాలయ్యారు. చనిపోయారు, వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇక గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. ఇది చాలా బాధాకరం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.