
Delhi Civil Lines News: రోజు రోజుకు మహిళలపై ఆకృత్యాలు మరింత పెరిగిపోతున్నాయి. నిన్న దివ్యాంగురాలు అయిన యువతిని రోడ్డుపై వెంటాడి మరీ గ్యాంగ్‌రేప్ చేసిన ఘటన మరువక ముందే దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టినరోజు వేడుకలు ఉన్నాయని ఆమెని ఆహ్వానించి నలుగురు వ్యక్తులపై ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘోర ఘటన జరిగింది. బాధిత యువతి (24) స్నేహితుడు పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించారు. మద్యం తాగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోలీసుల వివరాల ప్రకారం గురుగ్రామ్‌లోని కంపెనీలో పని చేస్తున్న అమ్మాయి ఒక స్నేహితుడు పుట్టినరోజు ఉందని ఇంటికి ఆహ్వానించాడు. దీంతో ఆమె అక్కడికి వెళ్ళింది. అక్కడ మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన తర్వాత ఆదివారం రోజు అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు.అయితే, ఆ యువతి తాగే కూల్ డ్రింక్‌లో కూడా వారు మద్యం కలపడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెని వాష్ రూమ్ లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు తనను తీవ్రంగా కొట్టి వీడియో కూడా తీశారని సదరు బాధితురాలు వెల్లడించింది. బయటకు విషయం తెలిస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించారు .
ఆమెను తిరిగి ఆమె ఇంటి బయట వదిలేసి వాళ్ళు వెళ్లిపోయారు. అయితే ఆమె ధైర్యం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు ఆమె వద్దకు వచ్చి వైద్యం పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందని తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా నిందితుల గురించి ఆరా తీస్తున్నారు ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో నిన్న ఒక దివ్యాంగురాలు పై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో నిందితులను పోలీసులు కాల్పులు జరిపి మరీ పట్టుకున్నారు. సోషల్ మీడియాలో సదరు యువతీ పారిపోతున్న దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. పోలీసుల ప్రకారం ఆమె బామ్మ ఇంటి నుంచి తిరిగి తన ఇంటికి వెళుతుండగా రాత్రి 8 గంటల సమయంలో ఆ అమ్మాయిని బైక్ పై వెంబడించి మరీ పొలాల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆమె మూగ, చెవిటి యువతి కావడంతో అరవలేకపోయింది. అపస్మానిక స్థితిలోకి వెళ్లిన ఆమెను నిందితులు అక్కడే వదిలి వెళ్లారు. కుటుంబ సభ్యులు సదరు యువతిని వెతికి దారుణం గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. ఆ క్రమంలో వాళ్ళ పై కాల్పులు జరపగా నిందితులకు గాయాలు అయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook