GATE 2025 Results: గేట్‌ 2025 ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డులు తెలుసుకోవడం ఇలా!

GATE 2025 Results Release Score Card Download Process: ఐఐటీలతోపాటు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల కోసం నిర్వహించిన గేట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గేట్‌ 2025 ఫలితాలు తెలుసుకునే విధానం ఇలా ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 19, 2025, 05:13 PM IST
GATE 2025 Results: గేట్‌ 2025 ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డులు తెలుసుకోవడం ఇలా!

GATE 2025 Results: దేశంలో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య అభ్యసించేందుకు ఐఐటీలు అత్యుత్తమైనవి. ఐటీటీలతోపాటు పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సులు చదివేందుకు రాయాల్సిన ప్రవేశ పరీక్ష గేట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంటెక్‌, పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌ 2025) ఫలితాలు వచ్చేశాయి. గత నెలలో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: 100 KG Gold Seize: వంద కిలోల బంగారం సీజ్‌.. ఎందుకు? ఎంత విలువ తెలుసా?

మొత్తం 30 సబ్జెక్టులకు గేట్‌ పరీక్షలను ఐఐటీ రూర్కీ నిర్వహించింది. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు జరగ్గా కొన్ని రోజుల కిందట ప్రాథమిక కీ విడుదల చేయగా.. తాజాగా ఫలితాలు వెలువరించారు. అభ్యర్థులు ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ ఈమెయిల్‌, పాస్‌వర్డ్‌ వంటి వివరాలను పొందిపరచి స్కోర్‌ కార్డు తెలుసుకోవచ్చు. మార్చి 28 నుంచి మే 31వ తేదీ వరకు స్కోర్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు ముగిశాక స్కోర్‌ కార్డులు కావాలంటే ప్రతి పరీక్ష పేపర్‌కు రూ.500 చెల్లించాల్సి ఉంది.

Also Read: Bumper Bonanza: ఐపీఎల్‌ బంపర్‌ బొనాంజా.. మ్యాచ్‌లకు ఉచిత ప్రయాణం

గేట్‌ పరీక్షలకు మొత్తం 8.37 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 80 శాతం మంది పరీక్షలు రాశారు. ఎంపికైన వారి వివరాలు బయటకు రాలేదు. గేట్‌ పరీక్షలు మూడు పద్ధతుల్లో జరిగాయి. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు, మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు, న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే.

గేట్‌ ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

  • జీఓఏపీఎస్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌లోకి (https://gate2025.iitr.ac.in/) వెళ్లాలి.
  • హోం పేజీలో లాగిన్‌ ఆప్షన్‌లో మీ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ, ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌ వంటివి పొందుపర్చాలి. అనంతరం లాగిన్‌ అవ్వాలి. అక్కడ కనిపించే గేట్‌ 2025 ఫలితాల ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
  • గేట్‌ రిజల్ట్స్‌లో 2025కి అర్హత సాధించిన గేట్‌ కటాఫ్‌ అభ్యర్థుల వివరాలు, సాధించిన మార్కులు అక్కడ కనిపిస్తాయి.
  • గేట్‌ స్కోర్‌ కార్డును విధిగా డౌన్‌లోడ్‌ చేసుకుని ఉండాలి. భవిష్యత్‌ అవసరాలకు స్కోర్‌ కార్డు తప్పక అవసరం పడుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News