)
PMSBY Get Rs 2 Lakhs Insurance: పేదల కోసం మోదీ సర్కార్ ప్రారంభించిన ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షలాది మంది లబ్ది పొందుతున్నారు. అయితే, కొంతమంది అవగాహన లోపం వల్ల కూడా ఈ పథకం లబ్ది పొందలేకపోతున్నారు. ఏడాదికి కేవలం రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షలు పొందుతారు. ఇది పేద సాధారణ వర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమైంది. మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని 2015 మే 9వ తేదీన ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాల్లో ఈ పథకం కూడా ఒకటి.
ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం ప్రతి ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఇది మరుసటి సంవత్సరం మే 31 వరకు చెల్లుబాటు అవుతుంది. ఇలా ప్రతి ఏడాది రూ.20 చెల్లిస్తే ఆ ఏడాదికి రూ.2 లక్షల కవరేజీ లభిస్తుంది.
ఈ పథకానికి మీరు పెద్దగా పనిచేయాల్సిన పనిలేదు. మీ బ్యాంకుకు వెళ్లి అక్కడ ఈ పథకం ప్రారంభించండి. ఆ తర్వాత ప్రతి ఏడాది ఆటోమెటిక్‌గా మీ ఖాతా నుంచి రూ.20 ప్రీమియం డెబిట్ అయిపోతుంది. ఇది పేద సాధారణ ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమైంది.
ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ద్వారా మీరు ఏడాదికి కేవలం రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా పొందుతారు. బీమా తీసుకన్నవారు ప్రమాదంలో చనిపోతే రూ.2 లక్షలు వారి కుటుంబానికి ఇస్తారు. ఒక వేళ ఏదైనా యాక్సిడెంట్లో వైకల్యం వస్తే రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష కవరేజీ లభిస్తుంది.
ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా. కాబట్టి కొన్ని లక్షలాది మంది ఇప్పటికే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఏదైనా హఠాత్పరిణామంలో ఉపయోగపడుతుంది. కేవలం రూ.20 మాత్రమే కాబట్టి సులభంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి బ్యాంకులో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దగ్గరలోని బ్యాంకు బ్రాంచీలు లేదా ఆన్లైన్లో కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ప్రమాద సమయంలో మీ కుటుంబానికి ఆర్థిక భరోసాను కూడా ఇస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook