Gold Cash Flight Rules: డొమెస్టిక్ విమానాల్లో బంగారం నగదుపై కొన్ని పక్కా నిబంధనలు ఉన్నాయి. పరిమితికి మించి నగదు లేదా బంగారం విమానంలో వెంట తీసుకెళ్తుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మీరు కూడా మీ వెంట నగదు లేదా బంగారం తీసుకెళ్లే ఆలోచన ఉంటే ఎంత వరకు తీసుకెళ్లవచ్చో చెక్ చేసుకోండి.
ఇటీవల కన్నడ నటి రన్యా రావు తన వెంట 14.2 కిలోల గోల్డ్ బార్స్ తీసుకెళ్తూ బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడింది. ఆమె వద్ద పట్టబడిన బంగారం విలువ 12.56 కోట్లు. ఈమె సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె. ఈ ఘటనలో మొత్తం 17.29 కోట్ల విలువైన మెటీరియల్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేయగా అందులో 4.73 కోట్ల విలువైన ఇతర సామగ్రి ఉంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమ బంగారం రవాణా నెట్‌వర్క్‌లో ఈమె కూడా భాగమని దర్యాప్తులో తేలింది. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా విమానాల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ పరిమితికి లోబడే నగదు లేదా బంగారం వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే విమానాశ్రయాల్లో కస్టమ్స్ సెక్యూరిటీ తనిఖీలు కఠినంగా ఉంటాయి. పరిమితికి మించి బంగారం లేదా నగదు క్యారీ చేస్తుంటే చట్టపరమైన చర్యలకు కురకాల్సి ఉంటుంది.
డొమెస్టిక్ విమానాల్లో ఎంత బంగారం తీసుకెళ్లవచ్చు
వాస్తవానికి డొమెస్టిక్ విమానాల్లో బంగారం ఎంత తీసుకెళ్లవచ్చనే విషయంపై క్లారిటీ లేదు. కానీ అధిక మొత్తంలో తీసుకెళ్తుంటే మాత్రం సెక్యురిటీ తనిఖీల సమయంలో అంత బంగారం ఎక్కడిదని ప్రశ్నించవచ్చు. ఒకవేళ 500 గ్రాముల కంటే ఎక్కువ బంగారం తీసుకెళ్తుంటే అందుకు తగ్గ కాగితాలు ఉండాలి. తగిన బిల్లు లేకుండా అధిక మొత్తం బంగారం క్యారీ చేస్తుంటే ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి సమస్య ఎదురు కావచ్చు.
ఎంత నగదు తీసుకెళ్లవచ్చు
అదే విధంగా డొమెస్టిక్ విమానాల్లో ఎంత నగదు క్యారీ చేయవచ్చనేది కూడా స్పష్టత లేదు. కానీ 50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే ఎక్కడిదో ఆధారం చెప్పాల్సి ఉంటుంది. 2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకు వెళ్తుంటే ఇన్‌కంటాక్స్ శాఖకు వివరాలు అందించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ విమానాల్లో బంగారం, నగదు ఎంత తీసుకెళ్లవచ్చు
అదే విదేశీ ప్రయాణాల్లో అయితే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. విదేశాల నుంచి ఇండియాకు వస్తుంటే పురుషులయితే తమ వెంట 50 వేలకు మించి బంగారం వెంట తీసుకురాకూడదు. అదే మహిళలు అయితే 1 లక్ష రూపాయల విలువైన బంగారు నగలు తీసుకురావచ్చు. 12 ఏళ్ల లోపు పిల్లలయితే 25 వేల విలువైన బంగారం వెంట తీసుకురావచ్చు. ఇది పరిమితి దాటితే మాత్రం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా బంగారు నగల విషయంలో మాత్రమే. గోల్డ్ బిస్కట్స్ లేదా బార్స్ క్యారీ చేస్తుంటే కస్టమ్స్ డ్యూటీ మరింత ఎక్కువగా ఉంటుంది.
ఇండియా నుంచి విదేశాలకు వెళ్తుంటే మాత్రం తమ వెంట 3 వేల డాలర్ల విదేశీ కరెన్సీ అంటే భారత కరెన్సీ ప్రకారం 2.5 లక్షలు తీసుకెళ్లవచ్చు. ఇంతకంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే మాత్రం ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. భారతీయ కరెన్సీ అయితే 25 వేల వరకు తీసుకెళ్లవచ్చు. అదే విదేశాల నుంచి ఇండియాకు వస్తుంటే మాత్రం 5 వేల డాలర్లు తీసుకురావచ్చు. మీ వెంట 10 వేల డాలర్ల కంటే ఎక్కువ నగదు లేదా ట్రావెలర్స్ చెక్స్ ఉంటే కస్టమ్స్ శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు బిగ్ షాక్, ఈసారి 2 శాతమే పెరగనున్న డీఏ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









