Ration Card: రేషన్ కార్డు ఉన్నప్రతి ఒక్కరికీ కేంద్రం అదిరిపోయే శుభవార్త..

Ration Card: రేషన్ కార్డు ఉన్నప్రతి ఒక్క వినియోగదారులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఒకేసారి మూడు నెలలకు సరిపడా సరుకులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 21, 2025, 09:44 AM IST
Ration Card: రేషన్ కార్డు ఉన్నప్రతి ఒక్కరికీ కేంద్రం అదిరిపోయే శుభవార్త..

Ration Card:రేషన్ కార్డు వినియోగిస్తూన్న ప్రతి ఒక్క పౌరులకు  కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. రానున్న వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలల రేషన్‌ను ఒకేసారి లబ్దిదారులకు పంపిణీ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది.

Add Zee News as a Preferred Source

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్దిదారులకు బియ్యం అందించడానికి 5.25 లక్షల టన్నులు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంతో అధికారులు గోడౌన్లలో ఉన్న సన్న బియ్యాన్ని సమీకరిస్తున్నారు. సన్నవడ్ల మిల్లింగ్‌ త్వరితగతిన పూర్తి చేయాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలోనే మూడు నెలలకు సరిపడా బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వర్షాకాలంలో దేశ వ్యాప్తగా గిరిజన గూడాలు, తండాల్లో వర్షాల వల్ల ప్రజలకు బయటకు రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అటు పర్వత ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు కూడా వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్నారు. మరోవైపు వర్షాల వల్ల రోజు వారి కూలీకి కూడా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం వర్షాల నేపథ్యంలో జూన్ నెలలోనే జూలై, ఆగష్టు నెలలకు సరిపడా సరుకులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News