Jio- Google Deal: గూగుల్‌తో జియో భారీ డీల్ ?
Debtless Reliance Industry: ముఖేష్ అంబానీ ( Mukesh Ambani ) తన జియో ( Jio ) ఫ్లాట్‌ఫామ్‌పై భారీ పెట్టుబడులను రాబట్టే కార్యక్రమాన్ని మరింతగా విస్తరిస్తున్నాడు. జియోతో చేతులు కలుపుతున్న సంస్థల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.https://zeenews.india.com/telugu/tags/jio
Jio Telecom Deals: ముఖేష్ అంబానీ ( Mukesh Ambani ) తన జియో ( Jio ) ఫ్లాట్‌ఫామ్‌పై భారీ పెట్టుబడులను రాబట్టే కార్యక్రమాన్ని మరింతగా విస్తరిస్తున్నాడు. జియోతో చేతులు కలుపుతున్న సంస్థల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఇంతకు ముందే ఫేస్‌బుక్‌తో ( Facebook - jio Deal ) సహా వివిధ సంస్థలు జియోలో మొత్తం15.64 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అయ్యాయి. తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ కూడా ( Google Jio Deals ) జియోలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 4 బిలియన్ డాలర్లుగా ఉంటుంది అని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ వార్త సంస్థ బ్లూమ్‌బర్గ్ ( Bloomberg) తెలిపింది. అయితే దీనిపై గూగుల్, జియో ఇంకా స్పందించలేదు. Gautam Gambhir: ధోనీపై మరోసారి విరుచుకుపడిన గౌతం గంభీర్
జియోలో ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌తో సహా సిల్వర్ లేక్ ( Silver Lake ) , కేకేఆర్ (KKR ) , ముబాదల ( Mubadala ) , క్వాల్కమ్ ( Qualcomm ) లాంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. వీటి విలువ సుమారు రూ.1.17 లక్షల కోట్లు ఉంటుంది. రిలయన్స్‌ను రుణరహిత ( Debtless Reliance Industry ) సంస్థగా మార్చే ప్రయత్నంలో భాగంగా ముఖేష్ అంబానీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ పెట్టుబడులు వస్తున్నాయి అని నిపుణులు చెబుతున్నారు.