Google Internship 2025: గూగుల్‌లో పనిచేయాలనుందా, ఇదే మంచి అవకాశం, ఆఖరు తేదీ ఎప్పుడంటే

Google Internship 2025: విద్యార్ధులకు శుభవార్త. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కొత్తగా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2025, 01:55 PM IST
Google Internship 2025: గూగుల్‌లో పనిచేయాలనుందా, ఇదే మంచి అవకాశం, ఆఖరు తేదీ ఎప్పుడంటే

Google Internship 2025: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండి టెక్ రంగంలో ఆసక్తి ఉంటే ఈ అవకాశం మీ కోసమే. గూగుల్ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో భాగంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ రంగాల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించనుంది. ఇలాంటి ఛాన్స్ మిస్ అయితే తిరిగి రావడం కష్టం. 

Add Zee News as a Preferred Source

గూగుల్ అందిస్తున్న ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం 12 వారాలు ఉంటుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు ఏప్రిల్ 17 లోగా అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ సైన్స్ లేదా టెక్నాలజీ రంగంలో ఎక్స్‌పీరియన్స్ కోసం ఇది పనిచేస్తుంది. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ  లేదా మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్ధులకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, నేచురల్ లాంగ్వేజ్ ప్రోసెసింగ్, ఆర్ఠిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి నేర్పిస్తారు. గూగుల్ ఉత్పత్తులపై పనిచేసే అవకాశం లభిస్తుంది. గూగుల్ నిపుణులు, సీనియర్ డెవలపర్స్ నుంచి గైడ్ లైన్స్ పొందవచ్చు. 

గూగుల్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి అక్కడ కన్పించే buildyourfuture లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 17, 2025. ఈ కోర్సు 12 నెలలు ఉంటుంది. ఈ సమయంలో గూగుల్ ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు వాటిని మెరుగుపర్చడం, సమస్య పరిష్కరించడం, ఇన్నోవేషన్ ప్రక్రియలో పనిచేసే అవకాశం కలుగుతుంది. 

Also read: Free Gas Cylinder Scheme: గుడ్‌న్యూస్, ఇక రెండో ఫ్రీ గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News