Teachers Holiday: ప్రభుత్వ టీచర్లకు 7 రోజుల సెలవులు.. ఎప్పుడు? ఎందుకో తెలుసా?

Govt Teachers 7 Days Holidays In April Month: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏప్రిల్‌ నెలలో భారీగా సెలవులు లభించనున్నాయి. అకాడమిక్‌ సంవత్సరం ముగుస్తున్న సమయంలో ప్రభుత్వ టీచర్లకు దాదాపుగా 7 సెలవులు లభిస్తున్నాయి.. ఎప్పుడు? ఎందుకో తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 27, 2025, 04:41 PM IST
Teachers Holiday: ప్రభుత్వ టీచర్లకు 7 రోజుల సెలవులు.. ఎప్పుడు? ఎందుకో తెలుసా?

Govt Teachers Holidays: ప్రభుత్వ ఉపాధ్యాయులకు భారీ శుభవార్త. ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా సెలవులు (School Holiday) లభించాయి. విద్యా సంవత్సరం క్యాలెండర్‌ ప్రకారం ప్రభుత్వ టీచర్లకు ఏడు రోజుల చొప్పున సెలవులు లభించనున్నాయి. విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు భారీగా లభిస్తున్నాయి. అకడమిక్‌ ఇయర్‌ ముగింపు వేళ ప్రభుత్వ టీచర్లకు లభించిన సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Allu Arjun: వివాదంలో అల్లు అర్జున్‌ 'జులాయి'.. ఆ సినిమాను చూసి అచ్చం అలానే! 

ఏప్రిల్‌ నెలలో అతి ముఖ్యమైన దినాలు.. పండుగలు ఉన్నాయి. ఏప్రిల్‌ నెలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Govt Teachers) కేవలం 16 రోజులు మాత్రమే పని దినాలు ఉన్నాయి. ఏడు రోజులు సెలవులు (Holiday) లభించనున్నాయి. ఉగాది (Ugadi) పండుగ అయిపోయిన తర్వాత ఏప్రిల్‌ నెల ప్రారంభమవుతోంది. లేకుంటే ఉగాదితో కలిపి ఎనిమిది రోజుల సెలవులు లభించే అవకాశం ఉండేది. రంజాన్‌ పండుగ, శ్రీరామ నవమి, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే తదితర ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రభుత్వ టీచర్లకు సెలవులు రానున్నాయి.

Also Read: Aghori Trapped: వశీకరణంతో అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన అఘోరీ? లైంగిక వాంఛ కోసమా?

ఏప్రిల్.2025
మొత్తం పని దినాలు: 16 రోజులు
01 ఏప్రిల్‌ 2025
రంజాన్ పండుగ సెలవు. ఈ రోజు దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి.

05 ఏప్రిల్‌ 2025
బాబు జగ్జీవన్ రామ్ జయంతి. ఈ రోజు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సెలవు ఉంటుంది.

06 ఏప్రిల్‌ 2025
ఆదివారం. యథావిధిగా ఆదివారం సెలవు లభించనుంది. ఈరోజు శ్రీరామనవమి ఉంది. ఆదివారం రావడంతో ఒక సెలవు ప్రభుత్వ ఉద్యోగులు కోల్పోయారు.
13 ఏప్రిల్‌ 2025
ఆదివారం. యథావిధిగా టీచర్లకు ఆదివారం సెలవు లభించనుంది.
14 ఏప్రిల్‌ 2025
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ జయంతి. ఈరోజు పాఠశాలలు సెలవులు ఉంటాయి. ప్రభుత్వ టీచర్లకు కూడా సెలవు ఉండనుంది.
18 ఏప్రిల్‌ 2025
క్రైస్తవులకు అతి పవిత్రమైన గుడ్ ఫ్రైడే రోజు పాఠశాలలకు సెలవు ఉండనుంది.
20 ఏప్రిల్‌ 2025
ఆదివారం. క్యాలెండర్‌ ప్రకారం యథావిధిగా సెలవు లభిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News