Gratuity New Rule In India: దేశవ్యాప్తంగా ఏ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా ఆయా సంస్థలు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని గ్రాట్యూటీ అంటారు. ఈ నిబంధనను చాలా ఏళ్లుగా కార్మిక నియమావళిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కార్మిక మంత్రిత్వ శాఖ గ్యాట్యూటీ అమలు చేసింది. తాజాగా ఈ గ్రాట్యూటీ చెల్లింపులపై కీలక మార్పులు చేశారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రాట్యూటీ అమలులో కీలక మార్పులు..
పాత నిబంధన ప్రకారం.. ఇప్పటివరకు ఒక ఉద్యోగి ఒక సంస్థలో కనీసం ఐదేళ్లు పనిచేస్తేనే ఈ గ్రాట్యూటీ సొమ్ము పొందేందుకు అర్హులుగా ఉంటారు.
తాజాగా ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం.. కొత్త కార్మిక నియమావళి అమలు తర్వాత.. ఈ అర్హత వ్యవధిని కేవలం ఒకే ఏడాదికి తగ్గించారు. దీంతో కొత్తగా ఉద్యోగాన్ని ప్రారంభించే వారికి ఏడాది కాలం తర్వాత నుంచే ఈ గ్రాట్యూటీ ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంది.
గ్రాట్యుటీని రద్దు చేసే హక్కు కంపెనీకి ఉందా?
గ్రాట్యుటీ అనేది ఉద్యోగి హక్కు అయినా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రాట్యూటీ చెల్లింపును పూర్తిగా నిలిపేసే లేదా తిరస్కరించే హక్కు చట్టబద్ధంగా ఉంది. గ్రాట్యూటీ చెల్లింపు చట్టం, 1972 ప్రకారం.. కొన్ని నిబంధనలు స్పష్టంగా వివరించాము.
గ్రాట్యుటీ రద్దుకు ప్రధాన కారణాలు
ఉద్యోగి కింది తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు రుజువైతే, సర్వీస్ పొడవుతో సంబంధం లేకుండా గ్రాట్యుటీని పూర్తిగా కోల్పోతారు. కంపెనీ నిధుల దుర్వినియోగం లేదా అవినీత కార్యకలాపాలకు పాల్పడడం లేదా సంస్థ ఆస్తులకు నష్టం కలిగించడం లేదా దుర్వినియోగం చేసిన సందర్భాల్లో ఉద్యోగి తన గ్రాట్యూటీని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగాన్ని పొందే క్రమంలో సదరు ఉద్యోగి నకిలీ పత్రాలు లేదా అధికార దుర్వినియోగం పాల్పడినా.. కంపెనీ సీక్రెట్ సమాచారాన్ని లీక్ చేసినా.. అసభ్యకరమైన ప్రవర్తన, శారీరిక, మానసిక వేధింపులు వంటి పనిచేసే చోట పాల్పడడం వంటి వాటి వల్ల గ్రాట్యూటీని ఇవ్వాలా లేదా అనేది కంపెనీకి విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడం
ఉద్యోగి నిర్లక్ష్యం లేదా తప్పు కారణంగా కంపెనీకి ప్రత్యక్ష ఆర్థిక నష్టం వాటిల్లినా..ఆ నష్టాన్ని ఆ ఉద్యోగి గ్రాట్యుటీ మొత్తం నుండి తగ్గించుకునే హక్కు కంపెనీకి ఉంటుంది. నష్టం మొత్తం గ్రాట్యుటీ కంటే ఎక్కువగా ఉంటే, తన ఉద్యోగికి వచ్చే జీతంలో కోత విధిస్తారు.
గ్రాట్యుటీ అనేది ఏ ఉద్యోగికి అయినా దక్కాల్సిన హక్కు. అయినా అది ఉద్యోగి నైతికత, క్రమశిక్షణ, కంపెనీ నియమాల పట్ల గౌరవంపై ఆధారపడి ఉంటుంది. మోసం, అవినీతి వంటి చర్యలు పాల్పడినా సదరు ఉద్యోగి తన ఆర్థిక ప్రయోజనాలను పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









