)
Groom brutally killed bride hours before wedding in Gujarat: ఇటీవల కాలంలో భార్యభర్తలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఒకరితో మరోకరు అన్యోన్యంగా ఉండకుండా ..స్కెచ్ లు వేసుకుని మర్డర్ లు చేసుకుంటున్నారు. ఒకర్ని మరోకరు ఎలా మట్టుపెట్టాలో అంటూ ప్లాన్ లు చేస్తున్నారు. మొత్తంగా కొంత మంది ప్రతిచిన్న విషయాల్ని పెద్దది చేసుకుని గొడవలు పెట్టుకుంటున్నారు. మరికొంత మంది వివాహేతర సంబంధాల్లో పడి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గుజరాత్ లోని భావ్ నగర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
మరో గంటలో వివాహం జరగాల్సి ఉండగా, కాబోయే భార్యను వరుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. భావ్‌నగర్‌కు చెందిన సాజన్ బరయ్య (25), సోని రాథోడ్ (23) గత ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు వీరి వివాహం జరగాల్సి ఉంది. బంధువులు, అతిథులు చేరుకున్నారు. అయితే... పెళ్లికి సరిగ్గా గంట ముందు భార్యభర్తల మధ్య చీర, ఖర్చుల విషయంలో గొడవస్టార్ట్ అయ్యింది. అది కాస్త పెద్దదిగా మారింది. దీంతో
ఆగ్రహంతో ఊగిపోయిన సాజన్, ఇంట్లోని ఇనుప రాడ్‌తో సోనిపై దాడి చేశాడు. ఆమె చేతులు, కాళ్లపై కొట్టి, అనంతరం తలను గోడకేసి బలంగా బాదాడు.దీంతొ తీవ్ర రక్తస్రావంతో సోని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పెద్ద శబ్దం , అరుపులు, కేకలు రావడంతో అతిథులు అక్కడకు వెళ్లి చూశారు. అప్పటికే సోనీ రక్తపు మడుగులో పడి ఉంది.
బరయ్యా..వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేష్ పటేల్ తెలిపారు.ఈ ఘటన ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి