
Videographer chases attacker with drone: మహారాష్ట్రలోని అమరావతి బద్నేరా రోడ్డులోని ఓ మ్యారేజ్ ఫంక్షన్లో.. ఎంతో సంతోషంగా ఉన్న వరుడు సుజల్ రామ్ సముద్రపై.. అకస్మాత్తుగా వచ్చిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతుందో కూడా ఎవరికి ఏం అర్థం కాలేదు. వరుడు తండ్రి నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతని పైనా దాడి చేశాడు.
దీంతో స్టేజ్‌పై ఉన్న కొందరు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వాళ్ల నుంచి తప్పించుకొని మండపం బయటకు వచ్చి.. తన ఫ్రెండ్ బైక్ ఎక్కి పారిపోయాడు. అయితే రిసెప్షన్ వేడుకకు సంబంధించిన చిత్రీకరణ కోసం ఏర్పాటు చేసిన డ్రోన్‌ను.. ఆపరేటర్ నిందితుల వైపు పంపడంతో అది వారిని వెంబడించింది.
దాదాపు రెండు కిలో మీటర్ల వరకు డ్రోన్ కెమెరా బైక్‌పై పారిపోతున్న నిందితులను వెంబడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో దృశ్యాలు అచ్చం సినిమాలో ఛేజింగ్ సీన్లను తలపించేలా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే డీజే పాటల విషయంలో జరిగిన గొడవ కారణంగానే ఈ దాడి జరిగినట్లు వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు. డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న సమయంలో.. వరుడు నిందితులను నెట్టడంతో వారి మధ్య వాదన జరిగింది.
దీంతో ఆగ్రహించిన జితేంద్ర బక్షి అనే యువకుడు పెళ్లి కొడుకుని కత్తితో పొడిచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. డ్రోన్ తీసిన వీడియో ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
A wedding in #Maharashtra's #Amravati turned into a crime scene on Monday when the groom was stabbed on stage.
A drone deployed to film the function not only captured the attack, it also tracked the fleeing accused and his accomplice for nearly two kilometres. pic.twitter.com/wh1vFUAiCc
— Hate Detector 🔍 (@HateDetectors) November 12, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook