close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

గుడ్ న్యూస్: అనేక వస్తువులపై జీఎస్‌టీ సవరించిన మోడీ సర్కార్ !!

గోవాలో జరిగిన జీఎస్టీ కౌన్సెల్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు

Updated: Sep 21, 2019, 12:23 AM IST
గుడ్ న్యూస్: అనేక వస్తువులపై జీఎస్‌టీ సవరించిన మోడీ సర్కార్ !!

దేశీయ కంపెనీలపై కార్పొరేట్ పన్ను తగ్గించిన మోడీ సర్కార్...  తాజాగా సామాన్యులకు ఊరట ఇచ్చే విధంగా అనేక వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించింది. ఇందులో హోటల్ గదుల పై జీఎస్టీ పన్ను తగ్గింపు, వెట్ గ్రైండర్ల పై పన్ను తగ్గింపు, చింతపండుపై పన్ను మినహాయింపు, అలాగే రక్షణ ఉత్పత్తులపై పన్నుమినహాయింపు గడువు పొడగింపు తదితర అంశాలు ప్రధానంగా ఉన్నాయి. భారత్ లో జరిగే ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమయ్యే వస్తువులు, సేవలపై జీఎస్టీ మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.  గోవాలో ఈ రోజు జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఆర్ధిక మంత్రి నిర్మలా నేతృత్వంలో జరిగిన 37వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే సవరించిన జీఎస్టీ రేట్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 

జీఎస్టీ కీలక నిర్ణయాలు ఇవే...

మెరైన్ ఇంధనంపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గింపు
చింతపండుపై 5 శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేత
వెట్ గ్రైండర్లపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతం తగ్గింపు. 
దిగుమతి చేసుకునే రక్షణరంగ ఉత్పత్తులకు 2024 వరకు పన్ను మినహాయింపు 
హోటల్ గది రూ.1000 లోపు అద్దె ఉండే హోటళ్లకు పూర్తిగా పన్ను మినహాయింపు
రూ.1000 నుంచి రూ.7500 వరకు అద్దె ఉండే హోటళ్లకు జీఎస్టీ 18 నుంచి 12 శాతం తగ్గింపు
రూ.7500 పైబడి అద్దె ఉండే హోటళ్లకు జీఎస్టీ 28 నుంచి 18 శాతం జీఎస్టీ తగ్గింపు
ఔట్ డోర్ కేటరింగ్ పై విధించే జీఎస్టీ 18 శాతం నుంచి ఐదు శాతం తగ్గింపు
కెఫెన్ తో కూడిన బేవరేజస్ పై జీఎస్టీ 18 నుంచి 28 శాతానికి పెంపు