
Ahmedabad Plane Crash: గుజరాత్ అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం గురించి వివరాలు అందే కొద్దీ షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. కచ్చితమైన అధికారిక సమాచారం లేకపోయినా వంద మంది వరకు మరణించి ఉండవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఈ విమానంలో ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది.
గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ సమయంలో అక్కడే జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఇవాళ జూన్ 12 మద్యాహ్నం 1.17 గంటలకు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం చెట్టుని ఢీ కొట్టి జనావాసాలపై పడిపోయినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలిలో భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. మేఘాని ప్రాంతంలో 828 అడుగుల ఎత్తు నుంచి విమానం కూలింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 242 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ ఉన్నారు. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ కుందర్ ఉన్నారు.
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాస్సేపటికే విమానం భారీ శబ్దం చేస్తూ నిప్పు కణికలా నేలకు రాలింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వీఐపీలు ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వీలైనంతవరకు అందర్నీ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వంద మంది వరకూ మరణించి ఉండవచ్చని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook