Hand Amputated After Fish Bite: కుక్క కరిస్తే ఇంజక్షన్లు తీసుకోక తప్పదు.. లేకపోతే ప్రమాదం పెరుగుతుంది. ఇప్పుడు చేప కరిస్తే ఏకంగా మనిషి శరీరంలో ఆ కరిచిన భాగాన్నే తీసివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ఎక్కడో కాదు కేరళ రైతుకు జరిగింది. రాజేష్ అనే కేరళ రైతు కన్నూరు జిల్లాలో ఉంటాడు. 38 ఏళ్ల ఈ రైతు తన పొలం దగ్గర ఉన్న చిన్న నీటి గుంతను శుభ్రం చేస్తుండగా ఓ చేప గత నెల ఫిబ్రవరి 9వ తేదీన కొరికింది. అయితే చిన్న దెబ్బ కదా అని తగ్గిపోతుందనుకున్నాడు. చేతులకు కూడా బొబ్బలు రావడం మొదలయ్యాయి. దీంతో అతను కొడియారి ప్రైమరీ హెల్త్ సెంటట్‌కు చికిత్స కోసం వెళ్లాడు. టీటీ ఇంజక్షన్ కూడా తీసుకున్నాడు.
ఈ రైతు చికిత్స అనంతరం తగ్గిపోతుందిలే అని అనుకున్నాడు. అయితే ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మణికట్టు వరకు సోకింది. ఇది 'కడు' అనే ఒక చేప కొరకడం వల్ల ఇలా అరుదుగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మొదటగా చిన్న గాయమే అయినా అది ప్రాణాంతకంగా మారింది. ఎంతకీ గాయం తగ్గకపోవడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్ళాడు రాజేష్. అది పరీక్షించిన వైద్యులు గ్యాస్ గ్యాంగ్రీన్‌గా నిర్ధారించారు. ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. అక్కడ అరచేతిని పూర్తిగా తొలగించకపోతే ప్రాణాలకు ప్రమాదం ఉంది.. అది మెదడుకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ముందుగా చేతి వేళ్లు తొలగించారు. ఆ తర్వాత మణికట్టు వరకు చేయిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది ఓ అరుదైన బ్యాక్టిరియా వల్ల జరుగుతుంది. మట్టి, బురద నీటిలో పెరిగే బ్యాక్టీరియా అని వైద్యులు చెబుతున్నారు. ఇది గ్యాంగ్రిన్ కి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. లక్ష మందిలో కేవలం ఇద్దరికే ఇది సోకుతుందని ఏదైనా మానని గాయాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: Today Horoscope: నేటి రాశిఫలాలు.. హోలీ రోజు ఈ రాశికి రాజయోగం.. జాగ్రత్తవహించకపోతే గండం..
క్లాస్ట్రీడియమ్ అనే బాక్టీరియా వల్ల సోకుతుంది. మొదటగా ఈ రైతు వేళ్లు తొలగించారు. ఆ తర్వాత ఇది అరచేతి కూడా సోకడంతో అరచేయని మొత్తం తీయాల్సి వచ్చింది. ఇక చేయని కోల్పోవడంతో ఓ స్పిన్నింగ్ మిల్‌లో పనిచేస్తున్న రాజేష్ పని కోల్పోయాడు. ప్రస్తుతం పశువులను పెంచి జీవనం సాగిస్తున్నాడు. ఈ బ్యాక్టీరియా చాలా ప్రాణాంతకం అతి త్వరగా శరీరానికి మొత్తం సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక సదరు వ్యక్తి ఆ భాగాన్ని తీసేస్తేనే ప్రాణాలకు ముప్పు ఉండదని చెబుతున్నారు .
ఇన్ఫెక్షన్ బారినప్పుడు గాయమైన ప్రాంతంలో చాలా నొప్పి అనుభవిస్తారు. కణాలు డ్యామేజ్ అయిపోతూనే ఉంటాయి, వాపు కనిపిస్తుంది. కొద్ది రోజుల్లోనే శరీరం అంతటికి వ్యాపిస్తుంది. ఇది మెదడుకు చేరితే మరింత ప్రమాదకరం. ఒక్కోసారి చేతులు లేదా కాళ్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అత్యంత జాగ్రత్త వహించాలని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Snakes: ఈ 2 వస్తువులు ఉంటే.. పాములు గంటకు 12 మైళ్ల స్పీడ్‌తో మీ ఇంటికి పరుగెత్తుకుని వస్తాయి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్- https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









