Hardik Pandya Mahieka Sharma Dating: ఎట్టకేలకు తనకు కాబోయే భార్యను టీమ్ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పరోక్షంగా పరిచయం చేశాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 సందర్భంగా మహికా శర్మతో సంబంధాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. ఆమె తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తన జీవితం మారిపోయిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షేర్ చేసిన ఓ వీడియోకి ఈ విధంగా కామెంట్ చేస్తూ హార్దిక్ పాండ్యా తమ ప్రేమ బంధాన్ని స్పష్టంగా తెలియజేశాడు.
మంగళవారం (డిసెంబర్ 9) దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా 101 పరుగుల తేడాగా ఘనవిజయం సాధించింది. అయితే ఈ విజయంలో హార్దిక్ పాండ్యా కీలకంగా వ్యవహరించాడు. కేవలం 28 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లోనూ 1 వికెట్ పడగొట్టాడు హార్దిక్ పాండ్యా. దీంతో ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
హార్దిక్ ఖాతాలో మరో రికార్డు..
ఈ మ్యాచ్‌లో హార్దిక్ 100 T20 సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా సృష్టించాడు. ఆసియా కప్‌లో క్వాడ్రిసెప్స్ గాయం (తొడ ముందు భాగంలోని కండరానికి గాయం) కారణంగా పాండ్యా రెండు నెలలకు పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దాదాపుగా 2 నెలల విరామం తర్వాత హార్దిక్ పాండ్యా బలమైన రీఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థి జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు.
సౌతాఫ్రికాతో T20 మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా ఈ విధంగా స్పందించాడు. "కొన్నిసార్లు గాయం జరిగినప్పుడు.. అది మనల్ని పరీక్షిస్తుంది. అది మిమ్మల్ని మానసికంగా అనుమానించేలా చేస్తుంది. కానీ దీనికి నా ప్రియమైన వారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నా భాగస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆమె నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి (అయితే మహికా శర్మ పేరు ప్రస్తావించలేదు) నా జీవితంలో ప్రస్తుతం విషయాలు బాగానే జరుగుతున్నాయి."
ఇదే వీడియోపై మహికా శర్మ కూడా కామెంట్ రూపంలో స్పందించింది. వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని నిర్ధారించింది. BCCI పోస్ట్ చేసిన వీడియోకి మహికా శర్మ "🤷🏽♀️" ఎమోజీని షేర్ చేయగా.. హార్దిక్ వీడియోలోని వ్యాఖ్యల విభాగంలో "నీలాంటి వారు ఎవరూ లేరు, నా రాజా..." అని రాసుకొచ్చింది. హార్దిక్, మహికా శర్మ ఇటీవలే అనేక సందర్భాల్లో సన్నిహితంగా కనిపించారు. హార్దిక్ పాండ్యా స్వయంగా తన సోషల్ మీడియాలో మహికా శర్మ ఫొటోలను కూడా షేర్ చేశాడు.
మహికా శర్మ ఎవరు?
మహికా శర్మ ఓ ఫేమస్ మోడల్. అనేక ఫ్యాషన్ డిజైనర్ల కోసం ఆమె ర్యాంప్ వేదికపై వాక్ చేసింది. అంతేకాకుండా ఆమె అనేక మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటించింది. అనేక మెయిన్ బ్రాండ్స్‌లతో పనిచేస్తూనే.. 'మోడల్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికైంది. హార్దిక్ పాండ్యాకు 32 ఏళ్లు కాగా.. మహికా శర్మకు 24 సంవత్సరాల వయసు కావడం గమనార్హం. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె ఢిల్లీ వాసి. నేవీ చిల్ట్రన్ స్కూల్‌లో చదువుకుంది. కళాశాలలో ఎకనామిక్స్, ఫైనాన్స్ చదివి, తన 10వ తరగతి బోర్డు పరీక్షలలో 10 CGPA పరిపూర్ణంగా సాధించింది. మహికా మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ (ఫైనాన్స్), విద్య, చమురు, గ్యాస్ వ్యూహంతో సహా వివిధ రంగాలలో ఇంటర్న్ చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









