Himani narwal murder case update: హర్యానాలో యువ కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ ను మార్చి 1న గుర్తు తెలియని దుండగులు హతమార్చి రోహ్ తక్ ఢిల్లీ హైవే మీద సూట్ కేసులో కుక్కి పడేశారు. హైవే మీద సూట్ కేసు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా.. అది కాంగ్రెస్ కార్యకర్తదని విషయం బైటపడింది. ఈ ఘటన హర్యాలో రాజకీయంగా చర్చకు దారితీసింది.
హిమానీ నర్వాల్ కాంగ్రెస్ లో గత కొన్నేళ్లుగా అనేక కార్యక్రమాలలో యాక్టివ్ గా పాల్గొంటుంది. ఫిబ్రవరి 28న ఖాట్మాండు లో కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది. ఆమె తల్లిఫిబ్రవరి 27తన కూతురితో మాట్లాడినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 28 నుంచి తమ కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపింది. అయితే.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు తమ కూతురు ఆయనతో పాటు నడిచిందని చెప్పారు.
హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపిందర్ హుడాతో తమ కూతురు సన్నిహితంగా ఉండేదని చెప్పింది. హిమానీ నర్వాల్ రోహ్ తక్ లో ఉంటు లా చేస్తునే.. మరోవైపు కాంగ్రెస్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేదని చెప్పింది. తమ కూతురు పార్టీలో ఎదగటం చూసి.. ఓర్చుకోలేక ఈ విధంగా హత్య చేసి ఉంటారని కూడా హిమానీ తల్లి.. సవిత కన్నీళ్లు పెట్టుకుంది. తమ కూతుర్ని హత్య చేసిన వాళ్లను అరెస్ట్ చేసే వరకు అంతిమ సంస్కారాలు చేయమని తెల్చి చెప్పింది.
ఈ క్రమంలో పోలీసులు ఈఘటనపై స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు హిమానీ నర్వాల్ స్నేహితుడు సచిన్ అరెస్ట్ చేశారు. హిమానీ నర్వాల్ కాల్ డాటాను విశ్లేషించారు. ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అదే విధంగా డబ్బుల విషయంలో కూడా గొడవలు చోటు చేసుకొవడం వల్ల ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులు ఎదుట అంగీకరించాడు.
ఫిబ్రవరి 28న హిమానీనర్వాల్ ను కలిశానని.. డబ్బులవిషయంలో గొడవలు జరిగి, మాట మాట పెరిగి, ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్లు సదరు వ్యక్తి పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









