HDFC Festive Treats: గ్రామీణ ఖాతాదారులకు HDFC బంపర్ ఆఫర్- హోమ్ లోన్స్, కార్, టూ వీలర్, ట్రాక్టర్ లోన్స్ తీసుకునే వారికి శుభవార్త

ప్రత్యేక రుణాలు, భారీ డిస్కౌంట్స్, అతి తక్కువ EMIలు

Last Updated : Oct 9, 2020, 08:45 PM IST
    • గ్రామీణ ఖాతాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బంఫర్ ఆఫర్స్ ప్రకటించింది.
    • HDFC Festive Treats పేరుతో పండగ ధమకా ఆఫర్లను ప్రవేశపెట్టింది.
    • దేశ వ్యాప్తంగా సుమారు లక్షా 20 వేల గ్రామాల్లో విలేజ్ కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా లెవల్ ఎంట్రిప్రిన్యూర్స్ కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
HDFC Festive Treats: గ్రామీణ ఖాతాదారులకు HDFC బంపర్ ఆఫర్- హోమ్ లోన్స్, కార్, టూ వీలర్, ట్రాక్టర్ లోన్స్ తీసుకునే వారికి శుభవార్త

గ్రామీణ ఖాతాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ ( HDFC ) బ్యాంకు బంఫర్ ఆఫర్స్ ప్రకటించింది. HDFC Festive Treats పేరుతో పండగ ధమకా ఆఫర్లను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా సుమారు లక్షా 20 వేల గ్రామాల్లో విలేజ్ కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) ద్వారా లెవల్ ఎంట్రిప్రిన్యూర్స్ ( VLEs) కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

సీఎస్సీలో ఉన్న చిరు వ్యాపారులు ఈ ఫెస్టివ్ ఆఫర్ల ద్వారా లాభాలను పొందే అవకాశం ఉంది. ఇందులో భాగంగా బ్యాంకు ఖాతాలు తెరవడం నుంచి రుణాలు పొందడం వరకు అనేక ప్రత్యేక ఆఫర్లను గ్రామీణ ఖాతాదారులు, వ్యాపారులు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా హోమ్ లోన్స్, 2-వీలర్ లోన్స్, కార్ లోన్స్, ట్రాక్టర్ లోన్స్, బంగారు రుణాలు, వ్యాపార రుణాలు పొందే అవకాశం ఉంది.

భారీ రాయితీలు
ప్రాంతీయ విపణిలో భాగంగా 3,000 కన్నా ఎక్కువ హైపర్ లోకల్ వ్యాపారులు, వర్తకుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టినట్టు వాటిని వినియోగించుకోవాల్సిందిగా బ్యాంకు కోరింది. దాంతో పాటు ఎలక్ట్రానిక్స్, కిరాణా, హోమ్ డెకోర్, బంగారు ఆభరణాలపై 5 శాతం నుంచి 15 శాతం వరకు రాయితీని పొందే అవకాశం కల్పిస్తోంది. మరోవైపు 1,000 పైగా జాతీయ, అంతర్జాతీయ ఆఫర్లపై రాయితీ పొందే అవకాశం కల్పించింది. 

ఇకపై వినియోగదారులు దగ్గరిలోని  కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC)కి  లేదా స్థానికంగా ఉన్న VLEకి వెళ్లి పండగ ఆఫర్లను వినియోగించుకోవచ్చు. కరోనావైరస్ ( Coronavirus )  మహమ్మారిని గమనించి ఈ ఆఫర్లను ఇంటర్నెట్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చు.

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

కీలకమైన ఆఫర్లు ఇవే
* కొన్ని రుణాలను ముందుస్తుగా ముగించడం ( Foreclosure) పై ఉన్న చార్జీలను తొలగిస్తారు.
* ద్విచక్ర వాహనంపై జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.  బండి తీసుకోవాలి అనుకునే వినియోగదారులు కేవలం రూ.1999 చెల్లిస్తే సరిపోతుంది. దాంతో పాటు EMIలపై 25 శాతం వరకు తగ్గింపును ఆరు నెలల పాటు వినియోగించుకోవచ్చు.
* అక్టోబర్ 1వ తేదీ నుంచి 15 నవంబర్ వరకు బుక్ చేసుకున్న ట్రాక్టర్ రుణాలపై 50 శాతం వరకు ముందస్తు చెల్లింపు ( Foreclosure) చార్జీలను తగ్గిస్తారు.  
* కిసాన్ గోల్డ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం వరకు రాయితీ ఉంటుంది.

 ALSO READ| Corona Effect: కరోనా కాలంలో భారత సినీ పరిశ్రమకు 9000 కోట్ల నష్టం

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News