Heart-touching student video: పుట్టిన ప్రతి బిడ్డకి తల్లి మొదటి గురువు అయితే.. ఆ బిడ్డ ఎదిగి బడికి వెళ్లిన తర్వాత విద్యా బుద్ధులను నేర్పించేది ఉపాధ్యాయులే అని చెప్పవచ్చు. ముఖ్యంగా మన నడవడికలు తీర్చిదిద్దేది కూడా ఉపాధ్యాయులే. మనం ఎలా తయారయ్యాం అనేది కూడా వారిపైనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక విద్యార్థి ఉపాధ్యాయుడి మధ్య బంధం ఎలా ఉండాలి అంటే తల్లికి బిడ్డకి మధ్య ఉండే అనుబంధంలా ఉండాలి అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు
ముఖ్యంగా అందరూ టీచర్లు పిల్లలతో ఇలాగే ఉంటారా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ ప్రతి ఒక్క విద్యార్థికి ఒక టీచర్ ఫేవరెట్ గా ఉంటారు. ఇక వారు ఒక రోజు స్కూల్ కి రాకపోయినా తమ అభిమాన టీచర్ ఎందుకు స్కూల్ కి రాలేదు అని తెగ తాపత్రయపడుతూ ఉంటారు. అలా అంతలా అభిమానించే టీచర్ వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ ఐతే ఇక ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో వర్ణనాతీతం.
ఇప్పుడు సరిగ్గా ఒక దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సుమారుగా పదుల సంఖ్యలో పిల్లలు తమ టీచర్ వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఆమెను పట్టుకొని బోరున ఏడ్చేస్తున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. ఆ టీచర్ కి ఆ పిల్లలకి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవ్వగా విపరీతమైన లైక్స్, షేర్స్ వచ్చేస్తున్నాయి. ఇక ఆ టీచర్ వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం కారణంగా పిల్లలు ఆమెను వదల లేకపోతున్నారు. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఏది ఏమైనా ఈ కాలంలో కూడా టీచర్ కి విద్యార్థికి ఇంత మంచి అనుబంధంగా ఉందా అని ఇది చూసిన చాలామంది నివ్వెరపోతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఏది ఏమైనా ఇలాంటి దృశ్యాలు చూడడానికి కచ్చితంగా గుండెను బరువెక్కిస్తాయి అనడంలో సందేహం లేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









