)
Heavy crowd in sabarimala ayyappa temple in kerala: కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేకంగా పూజలు చేసి ఆలయం తెరిచారు. ఆ తర్వాత సోమవారం నుంచి భక్తుల్ని దర్శనాలకు అనుమతిచ్చారు. ఈ క్రమంలో అయ్యప్ప దర్శనం కోసం భారీగా భక్తులు పలు రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. దీంతో ఎక్కడ కూడా కిలోమీటర్ల మేర క్యూలైన్ లు కన్పిస్తున్నాయి.
Why do they bring kids to these over crowded temples?
There should be rules to allow only 18+ at Sabari mala! pic.twitter.com/IhWh3xzJrj— Ravi Chandar (@ravikchandar) November 18, 2025
కన్నే స్వాములతొ వచ్చిన వారు,చిన్న పిల్లలతో వచ్చిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయ్యప్ప దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. మరోవైపు భక్తులకు కనీస సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది మండల- మకరవిళక్కు మండల పూజ ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమై… డిసెంబర్27న ముగియనుంది.
ఆ నేపథ్యంలోనే శబరిమల భక్తులతో కిటకిటలాడింది. తొలిరోజే భక్తజన సందోహం మెగా రికార్డు(1 లక్ష 25 వేలమందికి) రేంజ్లో అయ్యప్ప దర్శనానికి తరలివచ్చారు. మరోవైపు.. 22 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం కోసం వర్చువల్‌గా బుక్ చేసుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ట్రావెన్ కోర్ ఆలయ నిర్వాహకులపై అయ్యప్పలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీస వసతులు ఏర్పాటుచేయడంలో పూర్తిగా విఫలంఅయ్యారని అనేక మంది అయ్యప్పలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పిల్లలు సఫగేషతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం నవడానికి కూడా గ్యాప్ లేకుండా కిలోమీటర్ల మేర క్యూలైన్ లు ఉన్నాయని కూడా అయ్యప్పలు ఆందోలనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అయ్యప్పలు పడుతున్న అవస్థలకు చెందిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి